లారెన్స్ కి కలిసొచ్చిన "కాంచన"

PV Krishna
ఏ ముహూర్తాన "ముని" చిత్రాన్ని మొదలెట్టాడో కానీ అప్పటి నుండి రాఘవ లారెన్స్ కి కలిసొస్తునే ఉంది. 2007 లో హార్రర్ థ్రిల్లర్ గా రాఘవలారెన్స్ నుంచి వచ్చిన "ముని" చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే, అప్పటి నుండి  "ముని" సిరీస్ ల పేరిట  "కాంచన" "గంగ" లాంటి చిత్రాలను వరుసగా విడుదల చేసిన రాఘవ లారెన్స్ వాటితో కూడా అద్భుత విజయాలను అందుకున్నాడు. 

ఇక "ముని" సిరీస్ లో  నాలుగోవ భాగంగా "కాంచన3" చిత్రాన్ని ఈ వేసవి కానుకగా ఏప్రిల్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే,  మొదట నెగిటివ్ టాక్ తో విడుదలైన ఈ చిత్రం ఆ తర్వాత అనూహ్యమైన రీతిలో కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది, ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఆటు తమిళంలోనే కాక తెలుగులోని బి, సి సెంటర్స్ లో కూడా ఈ చిత్రం స్ట్రాంగ్ గా కలెక్షన్స్ ను రాబట్టుకోవడంతో లారెన్స్ తన నెక్స్ట్ పార్ట్ ని కూడా లైన్ లో పెట్టె పనిలో ఉన్నాడు, ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న "కాంచన4" "ముని5" చిత్రాన్ని పూర్తిగా  3డి టెక్నాలిజీలో తెరకెక్కిస్తున్నాడు లారెన్స్. 

ఇక  ఎన్నో ఏళ్లుగా  హిందీలో దర్శకత్వం వహించాలనుకున్నలారెన్స్ కలను "కాంచన"  నెరవేర్చింది.  "లక్ష్మి బాంబ్" పేరుతో  హిందీలో అక్షయ్ కుమార్, కియారా అద్వానీలతో ఈ చిత్రాన్ని చేస్తున్నాడు లారెన్స్, అయితే ఇందులో ముఖ్యపాత్రలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ నటిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 2020 పొంగల్ కి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు లారెన్స్. 
దీంతో లారెన్స్ కి ఇటు కలెక్షన్స్ పరంగా, మార్కెట్ పరంగా సౌత్ లో  క్రేజ్ ని ఇవ్వడమే కాకుండా బాలీవుడ్ లో కూడా దర్శకత్వం వహించే అవకాశం కూడా  "కాంచన" చిత్రంతో లభించడంతో  "కాంచన" లారెన్స్ కి బాగా  కలిసొచ్చిందనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: