అతను బ్యాటింగ్ చేస్తే చాలా బాగుంటుంది అంటున్న ప్రముఖ హీరోయిన్..!

KSK
దక్షిణాది సినిమా రంగంలో అన్నీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద స్టార్ల పక్కన నటించిన  ప్రేక్షకులను ఎంతగానో మైమరిపించిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ క్రికెటర్ రోహిత్ పై సంచలన కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్...టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవల ఇంస్టాగ్రామ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే 10 మిలియన్ ఫాలోవర్స్ సాధించుకుంది.


దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న కాజల్ అగర్వాల్ ముంబై బ్యాట్స్ మెన రోహిత్ శర్మ అంటే తెగ ఇష్టం అని తెలిపింది. అంతేకాకుండా రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుంటే చూస్తూనే ఉండిపోవాలి అన్పిస్తుందట. బరిలోగి దిగితే 200 కొట్టందే  బయటకు రాని రోహిత్ ని చూస్తుంటే అసలు టైమే తెలియదని చెప్తోంది కాజల్. దీంతో కాజల్ అగర్వాల్ చేసిన కామెంట్లకు సోషల్ మీడియాలో రకరకాల నెటిజన్లు వింత వింత కామెంట్ లు పెడుతున్నారు.


కాజల్ ది కూడా ముంబాయి...మరోపక్క రోహిత్ శర్మ కూడా ముంబాయి అయిన నేపథ్యంలో కాజల్ అగర్వాల్ కి ఇష్టమై ఉండొచ్చని ప్రాంతీయతత్వం తోనే కాజల్ అగర్వాల్ ఇష్టపడింది అని ...అయినా సరే రోహిత్ శర్మ కి పెళ్లి కూడా అయిపోయింది కాబట్టి కాజల్ రోహిత్ శర్మ ని ఇష్టపడటంలో తప్పేం లేదని కామెంట్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: