‘సైరా’వీరారెడ్డిగా జగపతిబాబు..ఫస్ట్ లుక్!

siri Madhukar
టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీస్తున్న మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ హిట్ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమాకి రాంచరణ్ నిర్మాతగా వ్యహరిస్తున్నారు.  బ్రిటీష్ పాలకులపై తిరగబడ్డ తొలి తెలుగు బిడ్డ ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 

ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతుంది..వచ్చే విజయదశమికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చూస్తున్నారు చిత్ర యూనిట్.  ఈ సినిమాకు సంబంధించి ఒక్కో పోస్టర్ సినీ తారల పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్ ల ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 

సైరా - నరసింహారెడ్డి'లో విలక్షణ నటుడు జగపతిబాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  నేడు జగపతిబాబు పుట్టినరోజు కాగా, ఈ సందర్భంగా చిత్రంలోని ఆయన లుక్ ను, మోషన్ టీజర్ ను యూనిట్ విడుదల చేసింది. 'సైరా'లో జగపతిబాబు వీరారెడ్డి పాత్రలో నటిస్తున్నారని చెబుతూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పింది.   రెడ్డి రాజుగా జగపతి బాబు గుబురు గడ్డం, పొడవైన జుట్టు, తలపాగా, నుదుటన కుంకుమతో కనిపిస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: