‘యాత్ర’సక్సెస్ టాక్..ఫ్యాన్స్ సందడే సందడి!

siri Madhukar

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా రెండు సార్లు ఎన్నికై ప్రజల మన్ననలు పొందిన ప్రజా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.  టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు చేరువ కావాలనే ధృడ నిశ్చయంతో ఆయన ‘పాదయాత్ర’ ప్రారంభించారు.  ఆ సమయంలో ఎండ, వాన, చలి లేక్కచేయకుండా ప్రజల వద్దకు వెళ్లి వారి కష్ట సుఖాలు తెలుసుకొని నేనున్నాను అంటూ భరోసా ఇచ్చి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు.  వైఎస్సార్ పాద యాత్ర మంచి సక్సెస్ కావడంతో ఆయనపై నమ్మకంతో ప్రజలు రెండు సార్లు ముఖ్యమంత్రి గా ఎన్నుకున్నారు.


రాజశేఖర్ రెడ్డి పరిపాలన సమయంలో తీసుకు వచ్చిన పథకాలు ఇప్పటికీ తెలుగు ప్రజలు మర్చిపోలేరు.  పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్య శ్రీ, విద్యార్థులకు ఫీజు రియాంబర్స్ మెంట్ ఇలా ప్రజలకు ఉపయోగ పడే పథకాలు అమల్లోకి తీసుకు వచ్చారు.  రచ్చబండ అనే కార్యక్రమానికి వెళుతున్న సమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో దివికేగారు.  వైఎస్సార్ జీవిత కథ ఆధారంగా మహి వి రాఘవ దర్శకత్వంలో ‘యాత్ర’సినిమా తీశారు..నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. 


ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో సక్సెస్ టాక్ తెచ్చుకోవడం.. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి జీవించారని..కొన్ని చోట్లు అసలు రాజన్ననే చూస్తున్నామా అన్నంతగా సనిమాలో చూపించారని పబ్లిక్ టాక్ వినిపిస్తుంది.  ప్రపంచ వ్యాప్తంగా సుమారు 970 స్క్రీన్స్‌పై భారీగా విడులైంది. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది..దాంతో అర్థరాత్రి నుండే థియేటర్స్ వద్ద సంబరాలు చేసుకుంటున్న వైఎస్ అభిమానులు. తెలుగు రాష్ట్రాల్లోనూ ‘యాత్ర’ థియేటర్స్ వద్ద జగన్, వైఎస్ అభిమానులు భారీ ఎత్తు హాజరౌతూ వైసీపీ జెండాలను రెపరెపలాడిస్తున్నారు. ఇక సినిమా చివర్లో జగన్ తెరపై కనిపించడంతో థియేటర్స్‌లో జై జగన్... సీఎం.. సీఎం.. నినాదాలతో హోరెత్తించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: