బాబోయ్ కన్ను కొట్టుడు నా వల్ల కాదు..! : ప్రియా వారియర్

siri Madhukar
ఒక్కసారి కన్ను కొట్టి దేశవ్యాప్తంగా ఓవర్ నైట్ స్టార్ అయిన  మాలీవుడ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన ‘ఒరు అడార్ లవ్’ ఇప్పుడు తెలుగులో ‘లవర్స్ డే’గా రాబోతోంది.  ఇటీవల ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విచ్చేసిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా తాను ఇప్పటి వరకు ఎన్నో వీడియోలు చూశాను..కానీ ప్రియా ప్రకాశ్ కన్ను కొట్టి సైగ చేసే వీడియో ఎంతో ప్రత్యకం అని అన్నారు. అంతే కాదు ఇది ఎంతో నేచురల్ గా ఉల్లాసాన్ని ఇచ్చే విధంగా ఉందని అన్నారు. 

ఈ ఫంక్షన్లో తనకు అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టమని..అంటూ అతనికి కన్నుకొట్టి షూట్ చేసింది.  తాజాగా  ‘లవర్స్ డే’సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రియా వారియర్ మాట్లాడుతూ.. తాను కన్నుకొట్టడం ఇంత వైరల్ అవుతుందని అప్పట్లో తాను ఊహించలేకపోయానని ప్రియ తెలిపింది. ఈ సినిమా తర్వాత తన జీవితంలో పెను మార్పలేమీ జరగలేదన్న ఆమె తానిప్పటికీ మిడిల్ క్లాస్ అమ్మాయినేనని పేర్కొంది. తాను ఇప్పటి వరకు 200 సార్లు కొట్టానని, తానెక్కిడికి వెళ్లినా ఇంకా కన్ను కొట్టమని అడుగుతున్నారని..బాబోయ్ ఇక నా వల్ల కావడం లేదంటుంది..ఈ మాలీవుడ్ బ్యూటీ.

కాకపోతే చిన్న నాటి నుంచి సినిమాల్లో నటించాలన్న కోరిక బలంగా ఉండేదని..అదృష్టం కొద్ది ‘ఒరు అడార్ లవ్’ చాన్స్ వచ్చిందని..ఓ సాంగ్ సందర్భంగా తాను కన్నుకొట్టి హీరోకి సైగ చేయడం అనుకోకుండా వైరల్ కావడం యాధృచ్చికంగా జరిగిపోయిందని అన్నారు.  కాలేజీకి వెళ్లేందుకు లోకల్ బస్సుల్లో ప్రయాణించడానికే మొగ్గుచూపుతానంది.

తానెక్కిడికి వెళ్లినా అభిమానులు సెల్ఫీలు అడుగుతుంటారని, దీంతో కొంత ప్రైవసీ కోల్పోయిన మాట నిజమేనని వివరించింది.  దర్శకుడు అట్లీ తనకు వీరాభిమాని అని, విజయ్ సేతుపతితో నటించాలని ఉందని మనసులో మాటను బయటపెట్టిన ఈ ప్రియా ‘ఐటెం సాంగ్స్’ చేయడానికి తనకు అభ్యంతరం లేదంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: