ఇలియానాతో ఎంగిలి ముద్దు కావాలంటున్న కుర్ర హీరో..?

Chakravarthi Kalyan

చిట్టినడుము ఇలియానా ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఊపేసింది. కోటి పారితోషకం అందుకున్న తారగా గుర్తింపు పొందింది. ఇప్పుడు కాస్త సినిమాలు తగ్గినా... మళ్లీ అమర్ అక్బర్ ఆంటోనీతో రీ ఎంట్రీ ఇచ్చింది ఇల్లీ డియార్. పాపం ఆ సినిమా ఫ్లాప్ కావడంతో కాస్త వెలుగు తగ్గింది.



అయితే సినిమాలు తగ్గినా ఇలియానా క్రేజ్ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. కొత్తగా ఇండస్ట్రీలో హిట్ కొట్టిన ఓ కుర్ర హీరో తాను ఇలియానా అంటే పడి చచ్చిపోతానంటున్నాడు. సాధారణంగా ఇంతవరకూ చెప్పడమే ఓ సాహసం. కానీ ఈ కుర్రాడు ఇంకా రెచ్చిపోతున్నాడు.



తనకు ఇలియానాను ముద్దు పెట్టుకోవాలని ఉందని పబ్లిగ్గా చెప్పేస్తున్నాడు. అందులోనూ అలాంటి ఇలాంటి ముద్దు కాదట. ఏకంగా లిప్ లాక్ కిస్ కావాలట. ఎందుకంటే.. తాను చిన్నప్పటి నుంచి ఇలియానాను ఆరాధిస్తున్నాడట.



ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో చెప్పలేదు కదా.. అతడే ఆర్‌ ఎక్స్ 100 హీరో కార్తికేయ. ఈ కుర్రాడు ఇప్పటికే ఆర్‌ఎక్స్ 100లో హీరోయిన్ రాజ్‌పుత్‌ తో లిప్ లాక్‌లు లాగేశాడు. పాపం. ఆ రుచి ఇంకా పెదాలపై నుంచే వెళ్లడం లేదేమో ఇప్పుడు ఇలియానా ముద్దు కావాలంటున్నాడు. మరి ఇలియానా చెవిలో ఈ మాట పడుతుందా.. ఆ చిట్టినడుము సుందరి కరుణిస్తుందా..?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: