ఆ సినిమాలపై బోయపాటి కామెంట్.. అవి నేను తీయలేను..!?

Chakravarthi Kalyan

బోయపాటి శ్రీను.. తెలుగు తెరపై హీరోను శక్తివంతంగా చూపించడమెలాగో బాగా తెలిసిన దర్శకుడు. పవర్ ఫుల్ హీరోగా కనిపించాలనుకునే హీరోలు.. ఒక్కసారైనా బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయాలని కోరుకుంటారు. బోయపాటి సినిమా అంటే తెరపై అడుగడుగునా భారీతనం కనిపించాల్సిందే.



మరి అలాంటి బోయపాటి శ్రీను.. చిన్నసినిమాలు చేసే ఛాన్సు ఉందా.. కొందరు డైరెక్టర్లు భారీ సినిమాల మధ్య రిలీఫ్‌ గా చిన్న సినిమాలు చేస్తుంటారు.. మరి అలాంటి ప్రయత్నం బోయపాటి చేస్తారా.. ఈ ప్రశ్నకు ఆయన నో అనే చెప్పేశారు.



తాను ఏ సినిమా చేసినా భారీగా ఉండాలనే కోరుకుంటాడట బోయపాటి శ్రీను. చిన్న సినిమాలు కూడా అలాగే ఉండాలని అనుకుంటాడట. మరి చిన్న బడ్జెట్‌తో ఆ భారీ తనం సాధ్యంకాదు కాబట్టి తాను చిన్న సినిమాలు చేయడట.

అంతే కాదు బయోపిక్ సినిమాలపైనా బోయపాటి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. బయోపిక్‌ సినిమా చేయాలని తనకూ ఉందట. కానీ బయోపిక్‌ తీయాలంటే కథలో దమ్ము ఉండాలంటున్నాడు బోయపాటి. అలాంటి కథ దొరికితే తప్పకుండా చేస్తానంటున్నాడో బోయపాటి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: