తన వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని ఏకంగా తన భార్తకు విడాకులు ఇచ్చానని చెబుతోంది మంచి నటిగా పేరున్న మళయాల తమిళ నటి. పూర్తి వివరాల్లోకి వెళ్తే, మళయాళ నటి ప్రియాంక నాయర్ పలు సినిమాలలో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, మళయాళ నటి ప్రియాంక నాయర్ పలు సినిమాలలో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. చూడచక్కని అందం ఆమె సొంతం. 2012 లో దర్శకుడు లారెన్స్ రావ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియాంక. పెళ్లైన కొన్నాళ్లు వీరి కాపురం బాగానే సాగింది. వీరికి ముకుంద రామ్ అనే కొడుకు కూడా పుట్టాడు. ఆ తరువాత వీరి మధ్య విభేదాలు రావడంతో భర్తకు విడాకులు ఇచ్చింది ప్రియాంక.
అయితే ఆ సమయంలో ప్రియాంక తన భర్తకు ఎందుకు విడాకులు ఇచ్చిందో కారణం నాడు చెప్పలేదు. తాజాగా ప్రియాంక నాయర్ ఒక ఇంటర్య్వూలో తన భర్తకు ఎందుకు విడాకులు ఇవాల్సి వచ్చిందో? చెప్పుకొచ్చింది. తన అంతరంగిక ఫోటోలను తన భర్త లారెన్స్ రావ్ సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడని, అందుకే ఆయనతో కాపురం చేయడం ఇష్టం లేక విడాకులు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
అంతేకాదు నేను నటించడం అతనికి ఇష్టం లేదు, అందుకే అతనితో కలిసి జీవించడం నాకూ ఇష్టం లేకే విడాకులు ఇచ్చానని చెప్పుకొచ్చింది. విడాకులు తీసుకున్న తరువాత పలు సినిమాలలో నటించింది ప్రియాంక.