షాకింగ్ మోక్షజ్ఞను తిరస్కరించిన బోయపాటి !

Seetha Sailaja
నందమూరి అభిమానులు అంతా మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటే మోక్షజ్ఞతో సినిమాను చేసే అవకాసం తనకు వచ్చినా తాను ఆ బాధ్యతలను స్వీకరించలేను అంటూ బోయపాటి శ్రీను సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీ పై ఎదురైన ప్రశ్న పై ఈకామెంట్స్ చేసాడు.

నందమూరి సింహం బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినిమా అనగానే అభిమానులలో ఊహకందని స్థాయిలో అంచనాలు ఉంటాయని అలాంటి అంచనాలు తనకు చేరుకోగల శక్తి లేదు అంటూ తన అసక్తత వ్యక్తపరిచాడు బోయపాటి. అయితే మోక్షజ్ఞ కొన్ని సినిమాలు చేసి సెటిల్ అయ్యాక ఒక భారీ మాస్ సినిమాను తాను తప్పకుండా మోక్షజ్ఞతో తీస్తాను అని సంకేతాలు ఇస్తున్నాడు బోయపాటి.

మాస్ సినిమాలు తీసే బోయపాటి కుటుంబ కథా సినిమాల దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దగ్గర అసిస్టెంట్ గా పనిచేసాడు అన్న విషయం చాలామందికి తెలియని నిజం. అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణ వీరాభిమాని అయిన బోయపాటి తన చిన్నప్పుడు కృష్ణ నటించిన అనేక జేమ్స్ బాండ్ సినిమాలను విపరీతంగా చూసాను అని అంటున్నాడు. 

నేటితరం ప్రేక్షకుల అభిరుచి ఎంత మారిపోయినా తాము జీవితంలో చేయలేని చాలాపనులు వెండి తెర పై హీరోలు చేస్తుంటే ఆనందిస్తూనే ఉంటారని నిజజీవితంలో ఒక అమ్మాయికి ధైర్యంగా ఐలవ్యూ చెప్పలేని చాలామంది యూత్ సినిమాలలో హీరోలు హీరోయిన్స్ వెంటపడుతూ ఐలవ్యూ చెపుతున్న సన్నివేశాలు చూసి ఎంజాయ్ చేస్తారని కామెంట్స్ చేసాడు. అందువల్లనే కాలం ఎంత పరుగులు పెడుతూ మారినా అభిరుచులు మారిపోయినా యాక్షన్ సినిమాలకు మరో 50 సంవత్సరాల వరకు మార్కెట్ ఉంటుంది అని అభిప్రాయ పడుతున్నాడు బోయపాటి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: