పవన్ టార్గెట్ లో విజయ్ దేవరకొండకు సమస్యలు !

Seetha Sailaja
నోటా’ పరాజయం తరువాత ఈవారం విడుదల కాబోతున్న ‘టాక్సీవాలా’ ఫలితం విజయ్ దేవరకొండకు అత్యంత కీలకంగా మారింది. వాస్తవానికి ఈసినిమా మొత్తం ‘టోరంట్’ సైట్ లో పైరసీ కాబడిన నేపధ్యంలో ఈసినిమా ఎడిట్ కాబడని రా మూవీని ఇప్పటికే చాలామంది సోషల్ మీడియాలో చూసిన నేపధ్యంలో ఈమూవీ పై ఇప్పటికే నెగిటివ్ టాక్ బాగా ప్రచారంలోకి వచ్చేసింది.

దీనితో ఈసినిమాను ఎలా రక్షించాలో తెలియక విజయ్ దేవరకొండ తెగ మధన పడిపోతున్నాడు. గతంలో ఇలాంటి సమస్య పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమా విషయంలో ఎదురైనా ఆ సమస్యను పవన్ మ్యానియా రక్షించ గలిగింది. ఇప్పటికే విజయ్ దేవరకొండను ద్వేషించే వారి సంఖ్య బాగా పెరుగుతున్న నేపధ్యంలో ఈ నెగిటివ్ ప్రచారాన్ని తట్టుకుని ‘టాక్సీవాలా’ కు భారీ ఓపెనింగ్స్ రాకపోతే విజయ్ కలక్షన్స్ స్టామినా పై సందేహాలు ఏర్పడే అవకాసం ఉంది అని అంటున్నారు.

ప్రస్తుతం ఇది చాలదు అన్నట్లుగా ఈమూవీ పై మరొక సరికొత్త ప్రచారం మొదలైంది. ఈమూవీ కథ హాలీవుడ్ లో విడుదలైన ‘టార్జాన్ ది వండర్ కార్’ మూవీకి పూర్తి కాపీ కథ అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ‘కారులో దెయ్యం’ అనే అంశం చుట్టూ తిరిగే ఈ మూవీ కథను పోలిన సినిమాలు ఇప్పటికే చాల విడుదల అయ్యాయి. 

ముఖ్యంగా నయనతార నటించిన ‘దొర’ మూవీ కూడ ఇదే కథాంశంతో తీయబడింది. దెయ్యాల కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలలో ఇప్పటి వరకు కొన్ని మాత్రమే హిట్ అయిన నేపధ్యంలో ఈమూవీ సక్సస్ పై చాల అనుమానాలు ఉన్నాయి అన్న ప్రచారం జరుగుతోంది. సినిమా ఫెయిల్ అయినా ఆసినిమాకు కలక్షన్స్ రాబట్టే స్టామినా విజయ్ కు లేదు అన్నది ‘నోటా’ రుజువు చేసింది. ఇలాంటి పరిస్థుతులలో ‘టాక్సీవాలా’ ఫలితం ఎలా ఉన్నా ఆమూవీకి భారీ ఓపెనింగ్స్ రాకపోతే విజయ్ దేవరకొండ ఇమేజ్ పై దెబ్బ పడటం ఖాయం అని వార్తలు వస్తున్న నేపధ్యంలో పవన్ మ్యానియా స్థాయిలో విజయ్ కు అదృష్టం ఉందా లేదా అన్నది ఈ ‘టాక్సీవాలా’ తెల్చబోతోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: