విజయ్ దేవరకొండ 'టాక్సీ వాలా' ప్రీ రిలీజ్ వేడుకకు బన్నీ..!
సినిమా షూటింగ్ మొదలై చాలా సంవత్సరాలు గడిచిన..చాన్నాళ్ల తర్వాత ఈనెల 17వ తారీఖున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు సినిమా యూనిట్. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు గతంలో సోషల్ మీడియాలో బాహుబలి హీరో ప్రభాస్ వస్తున్నట్లు వార్తలు రాగా...ప్రభాస్ గురించి వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఏంటి చెప్పేశారు టాక్సీ వాలా సినిమా యూనిట్.
ఈ క్రమంలో 'టాక్సీ వాలా' ప్రీ రిలీజ్ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నాడని ఖరారు చేశారు.ముందే విజయ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తారు.ఇప్పుడు దానికి తోడు బన్నీ రాక కూడా ఇంకా ఎక్కువ ఉత్సాహాన్ని వీరి అభిమానులకు అందిస్తుంది.
బన్నీ యొక్క మార్క్ స్పీచ్ మరియు విజయ్ యొక్క ఎనర్జిటిక్ స్పీచ్ తో అభిమానులను అయితే ఉర్రూతలు ఊగించడం మాత్రం ఖాయం...అని అంటున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారు.