రామ్ చరణ్ సైరా బడ్జెట్ వెనుక ఆ అజ్ఞాత వ్యక్తి !

Seetha Sailaja
‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయాలని అత్యంత భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ సొంతంగా నిర్మిస్తున్న ‘సైరా’ ప్రాజెక్ట్ పై ఖర్చు పెడుతున్న భారీ బడ్జెట్ చూసి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. అయితే ఇంత భారీ బడ్జెట్ సినిమాతీయడం లాబాలకోసం కాదనీ తన తండ్రి సినిమా బడ్జెట్ విషయంలో లాభనష్టాల గురించి తాను ఆలోచించను అంటూ ‘సైరా’ టీజర్ విడుదల సందర్భంగా ఓపెన్ గానే మీడియాతో చెప్పాడు. 

అయితే ఇప్పుడు చరణ్ చేస్తున్న ఈసాహసం వెనుక ఒక ‘అజ్ఞాత వ్యక్తి’ హస్తం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈవార్తల ప్రకారం ‘సైరా’ విషయంలో చరణ్ కు బడా సినిమాల నిర్మాత డివివి దానయ్య సహాయం లభిస్తున్నట్లు టాక్. 

ప్రస్తుతం దానయ్య  చరణ్ తో బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమాను అదేవిధంగా రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ చరణ్ లతో ఒక మల్టీ స్టారర్ ను తీస్తున్న నేపధ్యంలో దానయ్యకు చరణ్ తో ఏర్పడిన సాన్నిహిత్యం ‘సైరా’ ప్రాజెక్ట్ కు సహాయం చేసే అజ్ఞాత వ్యక్తిగా మార్చింది అని అంటున్నారు. ‘సైరా’ బిజినెస్ పూర్తి అయిన తరువాత చరణ్ దానయ్య ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఇవ్వడమే కాకుండా ‘సైరా’ బిజినెస్ లో కొంత షేర్ కూడ ఇస్తున్నట్లు ఫిలిం నగర్ లో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.

అయితే వాస్తవానికి చరణ్ వెనుక మెగా కాంపౌండ్ అండ ఉండటంతో పాటు చరణ్ అతి సన్నిహితులు కూడ చాలఉన్నత స్థితిలో ఉన్న నేపధ్యంలో చరణ్ కు దానయ్యను అడగవలసిన అవసరం ఏముందనీ మెగా కాంపౌండ్ సన్నిహితులు ఈగాసిప్పుల పై అభిప్రాయ పడుతున్నారు. అంతేకాదు ఎదోవిధంగా ‘సైరా’ పై బురద జల్లడానికి ఇలాంటి లేనిపోని వార్తలను సృష్టించి తమ నెగిటివ్ కోణాన్ని బయటపెడుతున్నారు అంటూ మెగా కాంపౌండ్ కు అత్యంత సన్నిహితంగా ఉండే వర్గాలు ఈవార్తలను ఖండిస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: