వెంకటేష్ రానాల విన్నపంలో బయటపడుతున్న మరోకోణం !

Seetha Sailaja
వెంకటేష్ తన నటవారసుడుగా రానాను ఎప్పుడు ప్రమోట్ చేయలేదు. దీనికితోడు వీరిద్దరూ కలిసి మీడియా ముందు అదేవిధంగా సినిమాలలో హడావిడి చేసిన సందర్భాలు చాల అరుదు. దీనితో వెంకటేష్ అభిమానులు వేరుగా రానా అభిమానులు వేరుగా తమ హీరోల ఇమేజ్ ప్రమోషన్ ను తమతమ స్థాయిలో కొనసాగిస్తున్నారు. 

అయితే వీరిద్దరినీ ఎన్టీఆర్ బయోపిక్ ఊహించని విధంగా కలిపింది. ఎన్టీఆర్ బయోపిక్ లో రానా చంద్రబాబునాయుడు పాత్రను పోషించడమే కాకుండా ఆమూవీలోని అతడి లుక్ ఇంచుమించు చంద్రబాబునాయుడులా ఉండటంతో తెలుగుదేశం పార్టీ అభిమానులు జోష్ లోకి వెళ్ళిపోతున్నారు. అంతేకాదు మరికొందరు తెలుగుదేశం పార్టీ అభిమానులు అత్యుత్సాహంతో రాబోతున్న ఎన్నికలలో వెంకటేష్ రానా అభిమానులు తమ పార్టీకి ఓట్లు వేస్తారు అంటూ అప్పుడే ప్రచారం కూడ మొదలు పెట్టి కొన్ని కర పత్రాలు బ్యానర్ల పై వెంకటేష్ రానాలు కలిసి ఉన్న ఫోటోలను ముద్రిస్తూ వారిద్దరి సపోర్ట్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని అర్ధం వచ్చేలా ఇప్పటి నుంచే ప్రచారం మొదలు పెట్టేసారు. 


అయితే జరుగుతున్న ఈఅనుకోని ప్రచారాన్ని చూసి వెంకటేష్ రానాలు వ్యూహాత్మకంగా రంగంలోకి దిగి తమ అభిమాన సంఘాలకు చెందినా నాయకుల పేర్లతో సోషల్ మీడియాలో ఒక కరపత్రాన్ని డిజైన్ చేసి ఈవార్తల పై తమ క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. వెంకటేష్ రానాలకు ఏపార్టీలతోను సంబంధాలు లేవనీ అన్ని పార్టీలు తమవే అన్న అర్ధం వచ్చేలా ఆ కరపత్రంలో వాడిన పదాలు ఉన్నాయి. 


అంతేకాదు తెలుగు ప్రజలకు సంబంధించిన ఇరు రాష్ట్రాలలోను తమ అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నారని వారంతా రకరకాల పార్టీల కోసం యాక్టీవ్ గా పనిచేస్తున్న విషయాన్ని వివరిస్తూ తామిద్దరం అన్ని వర్గాలకు చెందిన వ్యక్తులం అన్నసంకేతాలను ఇవ్వడానికి రానా వెంకటేష్ లు ప్రయత్నించారు. అంతేకాదు భవిష్యత్ లో తమ ఫోటోలను కలిపి వాడుకుంటూ తాము ఫలానా పార్టీకి అదేవిధంగా ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులం అంటూ కరపత్రాలు కానీ బ్యానర్లు కానీ హోర్డింగ్స్ కానీ తయారు చేయవద్దు అంటూ రానా వెంకటేష్ లు అభ్యర్ధిస్తున్నా వీరి మాటలు వీరి అభిమానులు ఎంత వరకు వింటారు అన్నదే సందేహం



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: