సల్మాన్ ఖాన్ ని పెళ్లాడుతా అంటూ..యువతి హల్ చల్!

Edari Rama Krishna

బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌ను పెళ్లాడేందుకు ముంబై వచ్చానంటూ 24 ఏళ్ల ఓ యువతి అతని ఇంటి వద్ద హల్‌చల్ చేసిన ఘటన ముంబై నగరంలో వెలుగుచూసింది.  తనను లోపలికి పంపాలని సెక్యూరిటీ గార్డులతో వాగ్వాదానికి దిగింది. వారు అడ్డుకోవడంతో అక్కడే ఉన్న బ్రిడ్జిపై హల్‌చల్ చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరాఖండ్‌కు చెందిన 24 ఏళ్ల యువతి నటుడు సల్మాన్ ఉండే గెలాక్సీ అపార్ట్‌మెంట్‌కు చేరుకుంది. 


సల్మాన్ ఖాన్ ని తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని..తన కోసం ప్రాణాలు అర్పించడానికైనా రెడీ అంటూ.. ఆయనను వివాహం చేసుకునేందుకు ఉత్తరాఖండ్ నుంచి వచ్చానని పేర్కొంది. తనను సల్మాన్ ఇంటిలోకి పంపాలంటూ అక్కడి సెక్యూరిటీ గార్డులను కోరింది. అందుకు వారు నిరాకరించడంతో వాగ్వాదానికి దిగింది.


అయినప్పటికీ వారు లోపలికి పంపకపోవడంతో అక్కడే ఉన్న బ్రిడ్జిపైకి ఎక్కి కేకలు వేసింది.  ముంబై పోలీసులు యువతిని అదుపులోకి తీసుకొని ఆసుపత్రికి పంపించగా ఆమెకు మతిస్థిమితం లేదని వైద్యులు తేల్చారని ముంబై పోలీసు ఎస్ఐ నారాయణ్ చెప్పారు. యువతి వద్ద దొరికిన ఫోన్ నంబర్ల ఆధారంగా పోలీసులు ఆమె తండ్రిని పిలిపించి యువతిని ఆయనకు అప్పగించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: