హరికృష్ణ పదే పదే అదే మాట అన్నాడు!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో మహానటులు ఎన్టీఆర్ తనయుడు నటుడు, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.  ఆయన నటుడే కాదు రాజీకీయాల్లో తనదైన సత్తా చూపించిన గొప్ప రాజకీయ నాయకుడు.  చిన్నతనంలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తండ్రి బాటలో నడిచారు.  రాజకీయాల్లో తండ్రికి ఎల్లవేలలా వెన్నంటి ఉంటూ వచ్చారు.  హరికృష్ణ గురించి ఎంతో మంది సెలబ్రెటీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

తనతో ఆయన మాట్లాడిన చివరి మాటలను పరుచూరి గోపాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. "ఆగస్టు 27వ తేదీన ఉదయం నేను హరికృష్ణకు ఫోన్ చేశాను. 'నాన్నా, మా అల్లుడు .. కూతురు మీ ఇంటికొచ్చి శుభలేఖ ఇచ్చారు చూశావా?' అని అడిగాను. 'చూడలేదు .. ఎవరిది పెళ్లి?' అని అడిగాడు. 'నా మనవరాలి పెళ్లి .. ఆగస్టు 30వ తేదీన .. నువ్వొచ్చి అక్షితలు వేస్తే .. అన్నగారే వచ్చి అక్షితలు వేసినట్టుగా భావిస్తాను' అన్నాను. కానీ తాను మాత్రం పెళ్లికి రాలేను..29 ఉదయాన్నే ఊరికి వెళుతున్నాను .. 30 పొద్దున్నే రాగలుగుతానో లేదో నాకు తెలియదు కదా' అన్నాడు. పోనీ 31 న సత్యానారాయణ వ్రతం ఉంది..ఆ కార్యక్రమానికైనా రాగలవా అన్నాను..మళ్లీ రాలేను అని సమాధానం చెప్పాడు.

ఇలా హరికృష్ణ నోటి వెంట ఏ దుర్ముహూర్తంలో రాలేను అన్న మాట వచ్చిందో కానీ నిజంగానే ఆయన తిరిగిరాలేని లోకాలకు వెల్లారు.   కాగా, ఆగస్టు 27 ఉదయం 11 గంటల 30 నిమిషాలకి నా మనవరాలిని పెళ్లి కూతురుని చేస్తారు .. అప్పుడు వచ్చి అక్షితలు వేయి' అని అడిగాను...ఆ మాట కాదనలేక ఆయన ఇంటికి వచ్చి నా మనవరాళిని దీవించి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. 

ఆ సమయంలో నేను బయట వేరే పనిలో ఉన్నాను..హరికృష్ణ వచ్చిన విషయం తెలుసుకొని వెంటనే వచ్చాను..కానీ అప్పటికే నాకు టైమ్ లేదే నేను వెళ్లిపోతున్నా అంటూ హరికృష్ణ వెళ్లిపోయారు..దేవుడు పదే పదే ఆయన నోటి నుంచి ఎందుకు మాట్లాడించాడో అర్థం కాలేదు..కానీ అంత మంచి మనిషి మన మధ్యలో లేకపోవడం చాలా విచార కరం అని కన్నీటి పర్యంతం అయ్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: