గీత గోవిందం ఓవర్సీస్ టాక్ !

Seetha Sailaja
అత్యంత భారీ అంచనాలతో ఈరోజు విడుదలైన ‘గీత గోవిందం’ ఓవర్సీస్ టాక్ బయటకు వస్తోంది. అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు ఈమూవీని చూసి సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్స్ పరిశీలిస్తే ‘గీత గోవిందం’ కు కూడ డివైడ్ టాక్ తప్పదా అన్న అనుమానాలు కలగడం సహజం. ప్రస్తుతం యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండకు ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం పైనే అతడి కెరియర్ ఆధారపడి ఉన్న నేపధ్యంలో ఈమూవీ రిజల్ట్ కోసం ఇండస్ట్రీ వర్గాలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. 

ఈమూవీని చూసిన విజయ్ దేవరకొండ అభిమానులు చాల బాగుంది అని కామెంట్స్ చేస్తూ విజయ్ దేవరకొండ రష్మికల లవ్ కెమిస్ట్రీ కోసం ఈమూవీని తప్పనిసరిగా చూడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈమూవీ చివర్లో వెన్నెల కిషోర్ కామెడీ ఈమూవీకి హైలెట్ గా మారుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. 

అయితే ఈమూవీని చూసిన సాధారణ ఓవర్సీస్ ప్రేక్షకులు ఈమూవీ రొటీన్ కథతో కూడిన మూవీ అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటే విజయ్ అభిమానులు మాత్రం  తెలుగు సినిమాకి మరో సూపర్ స్టార్ దొరికాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈమధ్య కాలంలో వచ్చిన మంచి వినోదాత్మక చిత్రంగా ‘గీత గోవిందం’ కు టాక్ వచ్చినా ఓవర్ ఆల్ గా ఏవరేజ్ చిత్రంగా మారే ఆస్కారం ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

చాలామంది ఈసినిమా కేవలం విజయ్ దేవరకొండ మ్యానియా పైనే ఆధారపడి విజయం సాధించాలని కథలో చెప్పుకోతగ్గ అద్భుతాలు లేవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరో రెండు వారాల వరకు ఈ చిత్రానికి పోటీ ఇచ్చే మంచిసినిమాలు ఏమీ రంగంలోకి దిగకపోవడంతో కలక్షన్స్ పరంగా ‘గీత గోవిందం’ కు తిరుగులేదు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈసినిమాకు సంబంధించి ఇంకా మన తెలుగు రాష్ట్రాల ప్రజల తీర్పుతో పాటు విమర్శకుల అభిప్రాయాలు కూడ ఇంకా రావలసిన నేపధ్యంలో ఈమూవీకి సంబంధించి ఇప్పటికి అందుతున్న ఈ ప్రిలిమినరీ ఓవర్సీస్ టాక్ ఎంత వరకు వాస్తవం అన్నది మరి కొన్ని గంటలలో తేలిపోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: