సినిమా ప్రపంచం అడుగు పెట్టడం అంటే ఏ జన్మలో పుణ్యం చేసుకోవాలని అంటారు కొంత మంది ఔత్సాహిక కళాకారులు. ఒక్కసారి సినిమా ఛాన్స్ వస్తే..అదృష్టం కలిసి వస్తే..స్టార్ ఇమేజ్ వస్తుంది. దాందో సొసైటీలో సెలబ్రెటీ హోదా దక్కుతుందని అభిప్రాయపడే వారు ఎంతో మంది ఉన్నారు. అయితే చాలా మంది హీరో, హీరోయిన్లు గా రాణించిన వారు కూడా కొంత కాలానికి కనుమరుగైపోయారు. అయితే సినీ ఇండస్ట్రీలో ఎవరి స్టార్ డమ్ ఎంత కాలమో చెప్పలేం.
కొంత మంది హీరో, హీరోయిన్లు మాత్రం 50 దాటినా కూడా యంగ్ గా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు. మరికొంత మంది హీరోయిన్లు 40 దాటినా గ్లామర్ గా కనిపిస్తూ కుర్రాళ్ల మనసు దోస్తుంటారు. ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్నంత కాలమే ఇండస్ట్రీలో నడుస్తుంది. ఒక్కసారి సినిమాల నుంచి కనుమరుగైపోతే అటు ఇండస్ట్రీ కానీ.. ఇటు ప్రేక్షకులు కానీ ఎవరూ పట్టించుకోరు. తాజాగా సోషల్ మీడియాలో ఒకనాటి హీరోకి సంబంధించిన ఫోటో చక్కర్లు కొడుతుంది. అసలు ఆ హీరో ఇతనేనా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
ఇంతకీ ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా.. 6 టీన్స్, నవ వసంతం, సొంతం, జానకీ వెడ్స్ శ్రీరామ్ తదితర చిత్రాల్లో హీరోగా నటించిన రోహిత్. ప్రస్తుతం రోహిత్ సినిమా ప్రపంచం నుంచి దూరంగా ఉంటూ తన వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్నాడు. ఇటీవల సడెన్గా ఒక ఫంక్షన్లో రోహిత్ కనిపించాడు. ఎవ్వరూ గుర్తుపట్టలేదట. రోహిత్ ని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారట..ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.