మహేష్ మ్యానియా ముందు షేక్ అవుతున్న పవన్ స్టామినా !

Seetha Sailaja
హీరోల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవడం నేటి తరానికి బాగా ఇష్టమైన అలవాట్లలలో ఒకటి. ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న టాప్ హీరోలు పుట్టింది పెరిగింది ఎక్కడ? వారు ఏమి చదువుకున్నారు లాంటి అనేక వ్యక్తిగత విషయాలను తెలుసుకునే క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగిపోవడంతో ఉదయం నుంచే సోషల్ మీడియాలో ఉంటున్న నెటిజన్లు స్టార్ హీరోల జీవితాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడం కోసం ‘వికీపీడియా’ ను కూడ తెగ సెర్చి చేస్తున్నారట.

ఈవిషయాన్ని ఈ సంస్థ ఈమధ్య లేటెస్ట్ గా ప్రకటించింది. మన టాలీవుడ్ హీరోలకు సంబంధించి విషయాలను తెలుసుకోవడానికి వికీపీడీయా పేజీని ఓపెన్ చేస్తున్న వారిలో  రోజుకు సగటున దాదాపు 6400 మందికి పైగా మహేష్ గురించి ఓపెన్ చేస్తున్నట్లు ఆసంస్థ ఈమధ్య తెలిపింది. 

దీనితో టాలీవుడ్ హీరోలకు సంబంధించి వికీపీడియాను పరిశీలించే వారిలో ఎక్కువ మంది మహేష్ గురించి చూస్తుంటే ఆ తర్వాత  స్థానం అల్లు అర్జున్ కు రావడంతో బన్నీ గురించి రోజుకు సగటున 5500మంది వికీపీడియాలో చూస్తున్నారు అని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ గురించి మాత్రం ఈసంస్థ ఒక ఆశ్చర్యకర విషయాన్ని బయటపెట్టింది. 

అభిమానుల విషయంలో ప్రధమ స్థానంలో ఉండే పవన్ గురించి మాత్రం రోజుకు 3700 మంది మాత్రమే పవన్ గురించి విషయాలు తెలుసుకోవడానికి వికీపీడియాలో చూస్తూ ఉండటంతో పవన్ 5వ స్థానంతో సరిపెట్టుకోవలసి వస్తోంది అని ఆసంస్థ పరిశోధనలో తెలిసినట్లు సమాచారం. అయితే ప్రభాస్ రామ్ చరణ్ లు మాత్రం ఈ వికీపీడియా సర్చింగ్ లో మూడు నాలుగు స్థానాలను పొందితే 6వ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నిలవడం ఆశ్చర్యకరం. పవన్ కళ్యాణ్ ను దేవుడుగా ఆరాధించే అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నా మహేష్ మ్యానియా ముందు పవన్ నిలబడలేక పోవడం ఒక విధంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయయం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: