హీరో సిద్దార్థ్ పై ప్రభాస్ ఫ్యాన్ సీరియస్!

Edari Rama Krishna
సాధారణంగా కొంత మంది హీరోలకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు..తమ హీరోని ఏమన్నా తమ సొంత వారిని అన్నంతగా ఫీల్ అవుతుంటారు..కొన్ని సార్లు అవతన హీరో ఫ్యాన్స్ ని చిత్తక్కొట్టిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.  తాజాగా హీరో సిద్దార్థ పై ప్రభాస్ ఫ్యాన్ చాలా సీరియస్ గా ఉన్నారు.  అదేంటీ తమిళ హీరో సిద్దార్థకు ప్రభాస్ కి సంబంధం ఏంటా అనుకుంటున్నారా! అసలు విషయానికి వస్తే..తమిళ సినీ విశ్లేషకుడు రమేష్ బాలా, తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ ప్రభాస్ పుట్టిన రోజుకు ఇంకా 100 రోజుల సమయం ఉందని, ఇప్పటికే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ట్వీట్ చేశాడు.

దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎక్కడో కాలింది..అంతే ఆయన పుట్టిన రోజుపై సిద్ధార్థ్ చేసిన కామెంట్ వెటకారంగా ఉందని వ్యాఖ్యానిస్తూ, టాలీవుడ్ జోలికి రావద్దంటూ హెచ్చరిస్తున్నారు.  వెంటనే సిద్దార్థ స్పందిస్తూ.. 'ఎందుకు ఇంత వెటకారం? నీ ఫ్రెండే కదా?' అని ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యపై సిద్ధార్థ్ స్పందిస్తూ, "అందుకే భయ్యా.

ఫ్రెండు కాబట్టే... ఫ్రీడం తీసుకున్నా... డార్లింగ్‌ కూడా నవ్వుతాడు జోక్‌ విని. ప్రతిదానికి టెన్షన్‌ పడితే లైట్‌ తీసుకోడానికి టైమ్‌ ఉండదు కదా భయ్యా?" అంటూ వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశాడు.  మరి ఇది ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్రెండ్లీగా స్వీకరిస్తారా..అలాగే కస్సుబుస్సుమంటారా వేచి చూడాలి. 
anduke bayya. Friendu kabatte...Freedom teeskunna. Darling kooda navvuthadu joke vini. Pratidaaniki tension padithe lite theeskodaniki time undadhu kadha bayya? https://t.co/YuayXmayWd

— Siddharth (@Actor_Siddharth) July 16, 2018#465DayToKingPRABHASNextBdayAfterThisOne

The countdown continues #HashtagsThrillButKillPleaseUseThemWithSomeDiscretion #Thanks https://t.co/kLYRLi07E5

— Siddharth (@Actor_Siddharth) July 16, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: