రాజ్ తరుణ్ ఆఫ్ మైండెడ్ నేచర్ పై సెటైర్లు !

Seetha Sailaja
వరస పరాజయాలతో సతమతమైపోతున్న రాజ్ తరుణ్ కెరియర్ ఈవారం విడుదల కాబోతున్న ‘లవర్’ మూవీ రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో వాస్తవాలు గ్రహించిన రాజ్ తరుణ్ తన ‘లవర్’ మూవీని ఎలాగైనా హిట్ చేయాలి అన్న పట్టుదలతో చాల గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు. 

ఇలాంటి పరిస్థుతులలో రాజ్ తరుణ్ ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆఫ్ మైండెడ్ నేచర్ ను బయటపెట్టుకున్నాడు. తాను బయటకు వెళ్ళడానికి పెద్దగా ఇష్టపడను అని చెపుతూ తాను ఎక్కువగా ఇంట్లోనే ఏదో ఆలోచిస్తూ కూర్చుని ఉండిపోతాను అన్న విషయం బయటపెట్టాడు. 

అంతేకాదు తనకు సడన్ గా మూడ్ వస్తే టైం తో సంబంధం లేకుండా లేచి కూర్చుంటాను అని అంటూ తనను భరించే శక్తి చాలామందికి ఉండదు అంటూ తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు రాజ్ తరుణ్. ఈవారం విడుదల కాబోతున్న ‘లవర్’ మూవీ సెకెండాఫ్ మొత్తం యాక్షన్ ట్రాక్ లోనే నడుస్తుందని వార్తలు వస్తున్నాయి. దీనితో రాజ్

తరుణ్ సినిమాలో ఇన్ని యాక్షన్ సీన్స్ ఉంటే జనం అంగీకరిస్తారా ? అన్న అనుమానాలు అప్పుడే మొదలైపోయాయి. లవర్ బాయ్ లా రొమాంటిక్ లుక్స్ లో కనిపిస్తూ తనదైన యాసలో కామెడీ టచ్ డైలాగ్స్ తో పాపులర్ అయిన రాజ్ తరుణ్ తన పద్ధతిని మార్చుకుని అనవసరంగా ప్రయోగాలు చేసి కెరియర్ పాడు చేసుకుంటున్నాడు అంటూ ఇప్పటికే కామెంట్స్ ఉన్నాయి. ‘లవర్’ మూవీ పేరుకు దిల్ రాజ్ నిర్మాణ సంస్థ పేరు పై విడుదల అవుతున్నా ఈసినిమాకు సంబంధించిన విషయాలు అన్నీ దిల్ రాజ్ సోదరుడు కుమారుడు హర్షిత్ రాజ్ తరుణ్ కలిసి తీసుకున్నారని దిల్ రాజ్ స్వయంగా చెప్పడంతో రాజ్ తరుణ్ ప్రయోగాలు విపరీతంగా ఉన్నాయా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: