ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో రంగస్థలం సంచలనం.. బాహుబలి తర్వాత అదిరిపోయే రికార్డ్..!

shami
మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా మార్చి 30న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. చిట్టిబాబుగా చరణ్ నట విశ్వరూపం చూపించాడు. ఇక ఈ సినిమా రికార్డుల లెక్క భారీగానే ఉంది.


200 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో సంచలనంగా మారిన రంగస్థలం సినిమా క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ 35ఎం.ఎం థియేటర్ లో సింగిల్ సెంటర్ లో కోటి రూపాయల కలక్షన్స్ తో రికార్డ్ సృష్టించింది రంగస్థలం. బాహుబలి సినిమా 25 రోజుల్లో ఈ రికార్డ్ అందుకోగా రంగస్థలం 31 రోజుల్లో ఈ రికార్డ్ బ్రేక్ చేసింది.


ఇక రంగస్థలం కన్నా ముందు ఫిదా 32 రోజుల్లో కోటి వసూళు చేసింది. కలక్షన్స్ లోనే కాదు రికార్డుల్లో కూడా బాహుబలి తర్వాత రంగస్థలం అన్నిటిలో నిలిచింది. 119 కోట్ల షేర్ కలక్షన్స్ తో రాం చరణ్ సత్తా ఏంటో బాక్సాఫీస్ పై మరోసారి ప్రూవ్ చేసింది రంగస్థలం. కొన్నాళ్లు కాస్త వెనుకపడ్డట్టు కనిపించగా ధ్రువతో హిట్ అందుకుంది రంగస్థలంతో రికార్డులు సృష్టించాడు రాం చరణ్. 


ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు చరణ్. ఆ సినిమా తర్వాత రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ తో కలిసి మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. చూస్తుంటే రాం చరణ్ కెరియర్ పీక్స్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. వరుస విజయాలతో దూసుకెళ్తాడని మాత్రం చెప్పొచ్చు.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: