ఆ కాంప్లిమెంట్ ఎన్నటికీ మర్చిపోలేను : రవితేజ
ఈ వేడుకకు హాజరైన రవితేజ మాట్లాడుతూ, ‘పదేళ్ల క్రితం ఒకరికి నేను ఫోన్ చేశాను. ఆ వ్యక్తి పక్కన పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. పవన్ కల్యాణ్ నాకు ఇచ్చిన కాంప్లిమెంట్.. ‘మీరు అంత సిగ్గులేకుండా ఎలా చేస్తారండి?’ అని అన్నారు. ఈ కాంప్లిమెంట్ ను నేనెప్పటికీ మర్చిపోలేను. ఇది వరకు ఇధ్దరం బాగానే కలుసుకుంటూ ఉండే వాళ్లం. ఇప్పుడు బిజీ అయిపోవడంతో కలవలేకపోతున్నాం. ఇక ‘నేలటిక్కెట్టు’ సినిమా గురించి చెప్పాలంటే.. ఈ సినిమా విజయం సాధిస్తుంది’ అని రవితేజ అన్నాడు.
జగపతిబాబు మాట్లాడుతూ ``నేను ఎలాంటి పాత్రలు చేసినా ప్రేక్షకులు అభినందిస్తున్నారు. అలాంటి పాత్రలు చేసి, చేసి అలాగే మారిపోతానేమోనని అనిపిస్తోంది. నేను దశాబ్దం క్రితమే పవన్ వ్యక్తిత్వం అంటే ఇష్టమని చిరంజీవిగారితో చెప్పాను. `బడ్జెట్ పద్మనాభం` సినిమా చేసేటప్పుడు నేను హీరో, రవి కేరక్టర్. ఆ సినిమాలో ఎలా ఉన్నాడో... ఇప్పుడూ అలాగే ఉన్నాడు. అదే ఫ్రెండ్లీనెస్ ఇప్పటికీ ఉంది. మాస్, క్లాస్ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా రామ్‌గారు, ఆయన భార్య రజనీగారికోసమైనా హిట్ కావాలి`` అని అన్నారు.