ఆశిష్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే సమయం రానే వచ్చింది..!

Pulgam Srinivas
దిల్ రాజు సోదరుడి కుమారుడు అయినటువంటి ఆశిష్ రెడ్డి తాజాగా లవ్ మీ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మే 25 వ తేదీన విడుదల కానుంది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ ను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని థియేటర్ లకి జనాలు ఎవరూ రావడం లేదు అనే నేపథ్యంలో రెండు వారాల పాటు థియేటర్ లను మూసి వేయాలి అని థియేటర్ ఓనర్స్ నిర్ణయం తీసుకున్నారు.
 

ఇక దానిపై చర్చ నడుస్తున్న సమయం లోనే లవ్ మీ మూవీ కి సంబంధించిన ఈవెంట్ జరగడంతో ఆ ఈవెంట్ లో భాగంగా ఆశిష్ మాట్లాడుతూ ... మా సినిమాలో అదిరిపోయే రేంజ్ కంటెంట్ ఉంది. జనాలను థియేటర్ లకి తీసుకు వచ్చే అంత స్టామినా ఈ సినిమాలో ఉంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక జనాలు అంతా థియేటర్ లకి వస్తారు. మూసిన థియేటర్ పను ఈ సినిమాతో తెరపిస్తా అని స్టేట్మెంట్ ఇచ్చాడు.

ఇక దానితో చాలా మంది ఈ సినిమాలో నిజంగానే ఫుల్ కంటెంట్ ఉండి ఉంటుంది. లేకపోతే ఆశిష్ ఎందుకు అలా మాట్లాడతాడు అని కొంతమంది అంటే , మరి కొంత మంది మాత్రం సినిమాలో నిజం గానే కంటెంట్ ఉందో... లేక ఇది పబ్లిసిటీ కూడా అయ్యి ఉండవచ్చు అని కూడా కొంత మంది భావిస్తున్నారు. ఇకపోతే ఆశిష్ తన స్టామినాను నిరూపించుకోవాల్సిన సమయం రానే వచ్చింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ను ఓపెన్ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమా యొక్క టికెట్ బుకింగ్ లకి మంచి రెస్పాన్స్ జనాల నుండి వస్తే కనుక ఆశిష్ ఇచ్చిన స్టేట్మెంట్ నిజమే అవుతుంది. ఒక వేళ ఇప్పుడు కాకపోయినా సినిమా విడుదల అయిన తర్వాత మంచి టాక్ వచ్చినా కూడా ఆశిష్ చెప్పిన స్టేట్మెంట్ నిజమే అవుతుంది. మరి ఆశిష్ సినిమాలో దమ్ము ఉండే ఆ మాట అన్నాడా..? లేక పబ్లిసిటీ కోసం వాడాడు అనేది సినిమా విడుదల అయితే కానీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: