వైసిపి: ఉత్తరాంధ్ర ప్రజలు జై కొట్టారా..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని సార్వత్రిక ఎన్నికల సైతం ఈ నెల 13న ప్రశాంతంగానే ముగిశాయి.. దీంతో అప్పటినుంచి ఎవరు అధికారంలోకి వస్తారనే విషయం పైన చాలా ఆసక్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఏపీలో ఒక సెంటిమెంట్ అయితే బాగా వినిపిస్తున్నది.. అదేమిటంటే అక్కడ  సత్తా చాటిన పార్టీకి అధికారం దక్కుతుందని సెంటిమెంట్ గత కొన్నేళ్ల నుంచి వస్తూనే ఉంది.. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలలో మొత్తం 34 స్థానాలు ఉన్నవి.. ఉమ్మడి విశాఖ జిల్లాలో 15, శ్రీకాకుళంలో 10, విజయనగరంలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నవి..

గత ఎన్నికలలో 34 గాను వైసీపీ 28 చోట్ల మంచి విజయాలను అందుకుంది. ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడడానికి సహాయపడింది. ఇటీవల జరిగిన ఎన్నికలలో జూన్ 4వ తేదీన ఫలితాలు ఎవరికీ అనుకూలంగా వస్తాయని విషయం పైన ఇప్పుడు సర్వత్ర చర్చ కొనసాగుతోంది దీనిపైన ఇరువురు పార్టీ నేతలు ఎవరు లెక్కలు వారు వేసుకుంటున్నారు. దీంతో అధికారం మాదే అంటూ మాదే అన్నట్టుగా సోషల్ మీడియా వేదికగా బాగానే ప్రచారం చేసుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలిస్తే ఆ పార్టీని విజయం అందుకుంటుంది.

2014 ఎన్నికలలో టిడిపి ఇక్కడ గెలుచుకున్న తరువాతే అధికారంలోకి రాగలిగింది. అలా 2019 వైసీపీ కూడా ఇక్కడ ఎక్కువ స్థానాలు గెలవడంతో అధికారాన్ని అందుకుంది. అయితే 2024 ఎన్నికలలో మాత్రం రెండు పార్టీలు మెజారిటీ సీట్లు గెలుచుకుంటామని భావనతో ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం వైసిపి పార్టీకి కాస్త అనుకూలంగా వాతావరణం కలిసొస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ రాజధాని సంక్షేమ పథకాలే వైసిపి పార్టీకి గట్టెక్కిస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి..

అయితే టిడిపి మాత్రం 2014లో 25 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. ఇప్పుడు వాటిని అధికమిస్తామంటూ తెలియజేస్తున్నారు. విశాఖ జిల్లాలో జనసేనతో పొత్తు టిడిపికి మైనస్ అవుతుందనే బాధను వినిపిస్తోంది. అంతేకాకుండా బలమైన టిడిపి నేతలు లేకపోవడంతో చివరికి జనసేన పార్టీ నాయకులకు టికెట్లు ఇచ్చారు. దీంతో చాలామంది కూటమికి కూడా దూరమయ్యారు. గతంలో విశాఖలో నాలుగు నియోజకవర్గాలు గెలుచుకున్న టిడిపి ఇప్పుడు ఒకటి మాత్రమే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయట. విజయనగరం జిల్లాలో వైసీపీ 9 సీట్లను గెలుచుకోగా ఈసారి తెలుగుదేశం పార్టీ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పదికి పది గెలుస్తామని వైసిపి నేతలు ధీమాతో ఉన్నారు. మొత్తానికి వైసీపీ చెబుతున్న లెక్కల ప్రకారం కూతమినీ టెన్షన్ పెట్టేలా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో జూన్ 4 వరకు ఆగల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: