టీవీ: 38 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న బుల్లితెర నటి..!

Divya
నిరంతరం ఎప్పుడు పాపులారిటీ సంపాదించుకున్న బుల్లితెర యాక్టర్లలో నటి జ్యోతి రాయ్ కూడా ఒకరు.. గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడమ్ గా అందరిని అలరించింది. ముఖ్యంగా ఇందులో సాంప్రదాయమైన పద్ధతిలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం హాట్ ఫోటోలతో సోషల్ మీడియానే షేక్ చేస్తూ ఉంటుంది జ్యోతిరాయ్. ఎలాంటి దుస్తులలోనైనా సరే ఇమే అందాలతో అరాచకం చేస్తూ ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా యంగ్ డైరెక్టర్ తో రిలేషన్ లో ఉన్నట్లుగా ఫోటోలు పెట్టడం వల్ల మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు కూడా వినిపించాయి. ఇటీవలే ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా కూడా కొన్ని ఫోటోలను షేర్ చేసింది జ్యోతి రాయ్.. అయితే ఈ విషయాల పైన ఈమె క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా జ్యోతి రాయ్ పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బ్యాక్ ఫోటోలను షేర్ చేస్తూ త్వరలోనే ఒక గుడ్ న్యూస్ ఉందంటూ కూడా ఆ ఫోటోలకి క్యాప్షన్ను జత చేసింది.. దీంతో ఒక్కసారిగా జ్యోతిరాయ్ అభిమానులు ఏంటా గుడ్ న్యూస్ అని తెగ వెతికేస్తూ ఉన్నారు.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఏదైనా సినిమాకు సంబంధించి గుడ్ న్యూస్ లేకపోతే 38 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అని చెప్పి అందరికీ షాక్ ఇస్తుందా అని పలు రకాల వార్తలైతే వినిపిస్తున్నాయి. జ్యోతి రాయ్ కి గతంలో కూడా వివాహమై తన భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కార్తీకదీపం సీరియల్ తర్వాత ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. కన్నడ నటి అయినప్పటికీ ఈమె అక్కడ హీరోయిన్గా కొన్ని సినిమాలలో నటించింది. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో తెలుగులో సీరియల్స్ లో నటించింది. మరి జ్యోతి రాయ్ చెప్పే ఆ గుడ్ న్యూస్ ఏంటో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: