కబాలి తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం కాలా. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 7న విడుదల కానుంది. చెన్నైలోని వైఎమ్‌సీఏ నందనంలో ఈ రోజు సాయంత్రం గ్రాండ్ ఆడియో వేడుక జరుపనున్న విషయం తెలిసిందే. అయితే కొద్ది సేపటి క్రితం సంతోష్ నారాయణ్ సమకూర్చిన స్వరాలను యూ ట్యూబ్ ద్వారా విడుదల చేశారు. మొత్తం 8 పాటలున్నాయి. మురికివాడల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో రజనీకాంత్.. కరికాలన్ అనే గ్యాంగ్‌స్టర్ పాత్ర పోషిస్తున్నాడు.
రజనీకాంత్ వైఫ్‌గా సీనియర్ నటి ఈశ్వరీరావ్, కొడుకు పాత్రలో దిలీపన్ నటిస్తున్నాడు. మొన్నటి వరకు యూఎస్ లో ఉన్న రజనీ ఆడియో వేడుక లోపు తిరిగి చెన్నైవచ్చారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. కబాలీ ఫేమ్ పా రంజిత్ ఈ మూవీకి దర్శకుడు. తమిళ నటుడు సముద్రఖని, నానాపటేకర్, బాలీవుడ్ బ్యూటీ హూమా ఖురేషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తలైవా తన పార్టీకి రజనీకాంత్ మక్కల్ మంద్రమ్ అనే పేరుని పెట్టబోతున్నారని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. 234 స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను బరిలో దింపనున్నట్టు గతంలోనే సూపర్ స్టార్ ప్రకటించారు.
పార్టీ నిర్మాణం రూపొందించే పూర్తి బాధ్యతని లైకా ప్రొడక్షన్స్ మాజీ అధినేత రాజు మహలింగం మరియు అభిమానుల సంఘం నాయకుడు సుధాకర్‌కి రజనీకాంత్ అప్పగించినట్టు తెలుస్తుంది. రజనీకాంత్ నటించిన కాలా చిత్రం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కగా ఈ మూవీని వండర్ బార్ బేనర్‌పై ధనుష్ నిర్మించాడు.