భరత్ అను నేను సినిమా హిట్ అని ముందే తెలిసిపోయిందా..!

Prathap Kaluva

ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే హీరోకు, డైరెక్టర్ మరియు నిర్మాత కు చాలా టెన్షన్ ఉంటుందని చెప్పవచ్చు. అది కూడా పెద్ద సినిమా అంటే  చెప్పక్కర్లేదు. సినిమా ఎంత బాగా వచ్చిన ఎంతో కొంత టెన్షన్ అయితే ఉంటుంది.అయితే భరత్ అను నేను సినిమా విషయం లో హీరో గాని డైరెక్టర్ గాని ఆఖరికి నిర్మాత కూడా టెన్షన్ గా ఫీల్ అవ్వడం లేదంట మహేష్ బాబు అయితే ఏకంగా హాలిడే ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతకీ అంత ధీమా ఎందుకో..!


ఇక వంద కోట్ల మేరకు వరల్డ్ వైడ్ గా థియేటర్ హక్కులు అమ్మారు నిర్మాత దానయ్య. మరి ఆ మేరకు టెన్షన్ చాలా వుండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్పైడర్, అజ్ఞాతవాసి లాంటి ఎంతో నమ్మకం పెట్టుకున్న సినిమాలు దెబ్బతీసి, నిర్మాతలను చాలా ఇబ్బంది పెట్టాయి. కానీ భరత్ విషయంలో నిర్మాత దానయ్య చాలా హుషారుగా కనిపిస్తున్నారట. దీనికి చాలా కారణాలు వున్నాయి. ఎందుకంటే సినిమాకు చేస్తున్న పబ్లిసిటీకి చాలా కార్పొరేట్ సంస్థలు తాము ఫ్రీగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాయట.


ట్విన్ సిటీస్ లో వందలాది హోర్డింగ్ లు ఫ్రీగా అరేంజ్ చేస్తున్నాయట. అలాగే వివిధ రకాలైన స్పాన్సర్ షిప్ లు వస్తున్నాయట. అందువల్ల సినిమాకు మరింత పబ్లిసిటీ రావడం కాకుండా, అదనపు ఆదాయం వస్తోంది. ఈ సినిమాకు అన్నీ కలిపి పన్నెండు నుంచి 15కోట్లు దానయ్యకు లాభంగా మిగుల్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లాభం సంగతి అలా వుంచితే, బ్యానర్ వాల్యూ పెంచే సినిమా అవుతుందని దానయ్య మాంచి కాన్ఫిడెన్స్ తో వున్నారని తెలుస్తోంది


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: