హన్సిక ప్రేమలో ప్రొబ్లెమ్స్ షురూ
ఇప్పుడు వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరగడం చూసి హన్సిక మమ్మీ ఇంకా గాభరా పడుతోందట. పెళ్లికి ముందే ఇలా తిరగడం తప్పు అని హన్సికకి చెబుతోందట. ఇటీవల బయటికొచ్చిన ఫొటోలు చూసి మరింత బాధపడుతోందట. హన్సిక పుట్టినరోజున శింబుతో కలిసి పార్టీ చేసుకొంది. ఆ పార్టీలో ఇద్దరూ కౌగిలించుకొన్న ఫొటోలు మరీ స్పైసీగా ఉన్నాయి. ఆ ఫొటోలు చూయిస్తూ హన్సికతో రోజూ ఇంట్లో రోజూ గొడవపడుతోందట వాళ్ల మమ్మీ.
సర్దిచెబుతున్నా వినకపోవడంతో ఆ ఫొటోలు బయటికి లీక్ చేసినవాడు ఎవడు అంటూ ఆరాతీస్తోందట హన్సిక. మరోపక్క శింబు మాత్రం హన్సికని ప్రాణంగా చూసుకొంటున్నాడు. చెన్నై శివార్లలో ఓ మంచి ఇల్లు కూడా కట్టిస్తున్నాడు. పెళ్లయ్యాక హన్సికతో కాపురం అందులోనే చేస్తాడట. మరి హన్సిక మమ్మీ అంత వర్రీ ఎందుకో...