పవన్ అనే నేను మిస్సింగ్ వెనుక అసలు కధ!

Seetha Sailaja
మహేష్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్న ‘భరత్ అనే నేను’ కథ వాస్తవంగా పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ  అని తెలుస్తోంది.

ఈమూవీ కధను దర్శకుడు శ్రీహరి నాను వ్రాసాడు అని తెలుస్తోంది. గతంలో ఈదర్శకుడు ‘తకిట తకిట’ అనే సినిమాను తీసాడు. సహజంగా తన సినిమాలకు కథలను తానే రాసుకునే కొరటాల శివ భరత్ అనే నేను విషయంలో మాత్రం ఏకంగా శ్రీహరి నానుకు కోటి రూపాయలు  చెల్లించిమరీ ఈకథను కొనుక్కున్నాడు అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి.

రచయయిత శ్రీహరి నాను 2014లో పవన్ కళ్యాణ్ ‘జనసేన’ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత వచ్చిన ఆలోచనతోనే ఈకథను  తయారుచేసాడని టాక్.  
అలాగే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందనే స్ఫూర్తితోనే ఈస్టోరీని శ్రీహరి నాను తయారు చేసాడని తెలుస్తోంది. ఈరచయిత 2015లోనే ఈకథను పవన్ కు వినిపిస్తే  తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు ‘జనసేన’ పార్టీ పెడుతున్నాననే రాంగ్ సిగ్నల్స్ ను జనాలకు పంపినట్లు అవుతుందని ఈ కధను తిరస్కరించి ఈ కధ చాలా బాగుంది అని ప్రశంసించాడట పవన్. 

ఈ సంఘటన జరిగిన కొద్దికాలనికి పవన్ సన్నిహితుడు ప్రముఖ నిర్మాత అయిన శరత్ మరార్ ద్వారా ఈ కధను గురించి తెలుసుకున్న కొరటాల ఈకథను వెంటనే కార్నర్ చేయడం ఆతరువాత ఆకథకు మహేష్ అంగీకారం తీసుకుని ‘భరత్ అనే నేను’ గా మార్చినట్లు తెలుస్తోంది. దీనితో పవన్ భవిష్యత్ లో ముఖ్యమంత్రి అవుతాడో అవ్వడో తెలియకపోయినా మహేష్ మాత్రం సిల్వర్ స్క్రీన్ పై ముఖ్యమంత్రిగా కనిపిస్తూ పవన్ చేయవలసిన పాత్రను తాను నిర్వర్తిస్తున్నాడు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: