రానా కస్టడీ లో బందీగా మారిన అఖిల్ !

Seetha Sailaja
అక్కినేని అఖిల్ ను టాప్ యంగ్ హీరోల లిస్టులో చేరుద్దామని నాగార్జున చేసిన రెండు ప్రయత్నాలు వికటించడంతో ఇప్పుడు అఖిల్ కెరియర్ ను సరిదిద్దే బాధ్యత రానా భుజస్కందాల పై తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నాగార్జున ప్రయోగాలు అన్నీ వికటించడంతో ఇప్పుడు హీరో రానా అఖిల్ పై ప్రయోగించబోతున్న ప్రయోగాలకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం ఒకొక్కటిగా బయటకు వస్తున్న నేపధ్యంలో అఖిల్ రానా కష్టడీలో బంధీగా మారిపోయాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి. 

ఆసక్తికరమైన ఈ కామెంట్స్ వివరాలలోకి వెళితే నాగార్జున సలహాతో రానా అఖిల్ కోసం దర్శకులను కథలను వెతికే పనిలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి అఖిల్ తన లేటెస్ట్ సినిమాకు సంబంధించి దర్శకుడు ఎంపికను గత నెలలో పూర్తి చేయవలసి ఉన్నా అఖిల్ ఆలోచనలలో మార్పు రావడానికి రానా కారణం అని అంటున్నారు. 

ప్రస్తుతం హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం అఖిల్ తదుపరి సినిమా కోసం ఒక మంచి కథతో పాటు ఒక మంచి దర్శకుడుని కూడ వెతికే పనిలో రానా బిజీగా ఉన్నట్లు టాక్. దీనికోసం రానా తన బాలీవుడ్ కోలీవుడ్ పరిచయాలను రంగంలోకి దింపుతూ అఖిల్ ప్రాజెక్ట్ కు తానే నిర్మాతగా మారి ఒక సినిమాను తీసి నాగార్జున తన పై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయడానికి రానా ప్రస్తుతం చాల బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ పరిస్థుతుల నేపధ్యంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ను రానా అఖిల్ కోసం రంగంలోకి దింపి ప్రయత్నాలు మొదలు పెట్టిన నేపధ్యంలో ఈసారి అఖిల్ పూరి ప్రయోగాలలో చిక్కుకున్నాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఇప్పటికే వరస పరాజయాలతో సతమతమౌతున్న పూరీని నమ్ముకునే కన్నా ఎవరైనా యంగ్ డైరెక్టర్ చేతిలో అఖిల్ ను పెడితే బాగుంటుంది అని రానా కు మరికొందరు సూచనలు ఇస్తున్నట్లు టాక్. అయితే అఖిల్ దృష్టి మాత్రం కొరటాల శివ పై ఉన్న నేపధ్యంలో ఏదోవిధంగా కొరటాల అఖిల్ ల ప్రాజెక్ట్ ఫైనల్ చేయాలని రానా తన వంతో ప్రయత్నాలు అన్ని విధాల ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: