జాతీయ జెండా పై శ్రద్ధ చూపని పవన్ కళ్యాణ్ ?

Seetha Sailaja

 

పవన్ కళ్యాణ్ ఉపన్యాసం ముగించినప్పుడు ప్రతిసారి ‘జైహింద్’ అంటూ తన అభిమానులలో దేశ భక్తిని నింపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతేకాదు తనకు మన జాతీయ జెండాకు ఉన్నంత పోగరుంది అని అంటూ ఉంటాడు. అయితే అనూహ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ర్యాలీలో జాతీయ జెండాకు అవమానం జరిగింది అన్న వార్తలు వస్తున్నాయి.

 

ఒక ప్రముఖ తెలుగు దిన పత్రిక ఈ ఆసక్తికర విషయాన్ని వెలుగులోకి తీసుకు వచ్చింది. నిన్న పవన్ కల్యాణ్ టూర్ చేసిన కొండగట్టు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఆంజనీయ స్వామి ఆలయంలో పూజలు చేసిన పవన్ బయటకు వస్తున్న క్రమంలో ఆయన అభిమానులు, కార్యకర్తలు ‘జనసేన’ జెండాలతో పాటు జాతీయ జెండాలు ఊపారు.

 

ఈ క్రమంలో రెండు జాతీయ జెండాలు చిరిగిపోయినప్పటికీ కార్యకర్తలు పట్టించుకోలేదు అని తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కారుపైకి చేరుకోగానే అత్యుత్సాహంతో అభిమానులు ఆయనపైకి జనసేన జాతీయ జెండాలను విసిరేశారు. దీనితో పవన్ బౌన్సర్లు జాతీయ జెండాలను ఇష్టారాజ్యంగా నలిపి పక్కకు పడేయడం కొన్ని ప్రముఖ మీడియా సంస్థల దృష్టికి రావడంతో ఆవిషయాన్ని కూడ ప్రముఖంగా కవర్ చేసారు.

 

ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర పై నిన్న రాత్రి ఒక ప్రముఖ ఛానల్ ప్రసారం చేసిన చర్చా గోష్టిలో పాల్గొన్న చాలామంది విశ్లేషకులు అధికార పార్టీలను ఆ అధికార పార్టీ ముఖ్యమంత్రిని పొగుడ్తూ పవన్ పోషిస్తున్న ప్రతిపక్ష పాత్ర అర్ధం కాని విషయంగా ఉంది అంటూ ఘాటైన విమర్శలు చేసారు. మరి కొందరైతే జనసేన పొలిటికల్ పార్టీ పాత్రను నిర్వర్తించకుండా పొలిటికల్ ఎన్జీవో లా మారిపోయింది ఘాటైన సెటైర్లు వేసారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: