వరుస ఫ్లాప్ లు ఉన్న భారీగా డిమాండ్ చేస్తున్న పూజ హెగ్డే..?

Pulgam Srinivas
తెలుగు , తమిళ , హిందీ పరిశ్రమలలో మంచి గుర్తింపు కలిగిన యువ నటి మనులలో పూజా హెగ్డే ఒకరు. ఈమె ఇప్పటివరకు ఎన్నో తెలుగు , తమిళ , హిందీ సినిమాలలో నటించి వాటిలో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈ బ్యూటీ తన నటన కంటే కూడా అందాలతోనే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. దానితో స్టార్ హీరోలు నటించే కమర్షియల్ సినిమాలలో ఈమె కొంత కాలం పాటు మొదటి ఆప్షన్ గా మారిపోయింది.

దానితో ఈమె రెస్ట్ లేకుండా సినిమాల్లో నటిస్తూ వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ నటించీమ ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించకపోవడంతో ఈమెకు అవకాశాలు తగ్గాయి. అవకాశాలు తగ్గినా కూడా పూజ హెగ్డే రెమ్యూనరేషన్ తగ్గించడం లేదు అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఈమె ఒక్కో మూవీ కి దాదాపు 5 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. దీనితో వరుస అపజయాలు వచ్చినా కూడా ఇంతలా డిమాండ్ చేస్తుంది.

ఈమె కంటే వేరే హీరోయిన్ తో ప్రొసీడ్ అవడం మంచిది అని కొంత మంది అభిప్రాయపడుతూ ఉంటే ... మన కొంత మంది మాత్రం పూజా హెగ్డే తన నటన కంటే కూడా అందాలతో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటుంది. కమర్షియల్ సినిమాలలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. వారు అంత గ్లామర్ షో తోనే ప్రేక్షకులను ఎక్కువగా అలరించాల్సి ఉంటుంది. అలా అలరించే సత్తా ఉన్న పూజ హెగ్డే కు ఐదు కోట్ల రెమ్యూనరేషన్ పెద్ద విషయం ఏమీ కాదు అని , సినిమా హిట్ అయితే అందులో ఈమె పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనాప్పటికీ పూజా హెగ్డే అందానికి ఒక్క హిట్ పడితే మళ్లీ అదిరిపోయే క్రేజీ ఆఫర్ లు ఈమెకు దక్కే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: