పవన్ సహాయనిరాకరణలో బయ్యర్లు ?

Seetha Sailaja
‘అజ్ఞాతవాసి’ విడుదలై దాదాపు 11 రోజులు దాటుతున్నా ఈసినిమాకు సంబంధించిన వ్యవహారాలూ ఇంకా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గానే కొనసాగుతున్నాయి. ఈమూవీ నిర్మాత  రాధాకృష్ణకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉండటమే కాకుండా సౌమ్యుడు నిర్మొహమాటి అన్న పేరు కూడ ఉంది. 


ఈకారణంతోనే ఎటువంటి వివాదాలు లేకుండా ‘అజ్ఞాతవాసి’ వల్ల నష్టపోయిన బయ్యర్లకు ఎంతోకొంత నష్టం పూడ్చాలని తద్వారా ప్రస్తుతం తాను జూనియర్ త్రివిక్రమ్ లతో తీస్తున్న మూవీ మార్కెట్ కు ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని తనవంతు ప్రయత్నాలు రాథా కృష్ణ మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈసినిమాకు భారీ బడ్జెట్ ఖర్చు కావడంతో వడ్డీలన్నీ లెక్క వేసుకుంటే అన్నీ పోను ఈనిర్మాతకు మిగిలింది కేవలం 8 కోట్లే అని అంటున్నారు.


అయితే ‘అజ్ఞాతవాసి’ బయ్యర్లకు తన వంతుగా 15 కోట్లు బయ్యర్లు వెనక్క ఇవ్వాలని రాధాకృష్ణ భావిస్తున్నట్లు  టాక్. ఈవిషయంలో సహాయం చేయమని రాథాకృష్ణ పవన్ ను సంప్రదిస్తే ఈవిషయంలో తానేమి చేయలేనని చేతులు ఎత్తేసినట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. అంతేకాదు తాను తన బయ్యర్లకు జవాబుదారి కాదని కేవలం తన ఫ్యాన్స్ కు మాత్రమే బాధ్యత వహించే వ్యక్తిని అంటూ కామెంట్ చేసినట్లు టాక్. 


దీనితో పవన్ డబ్బు దగ్గర ఈమధ్య చాల ఖచ్చితంగా ఉంటున్నాడు అని వస్తున్న మాటలకు ఈగాసిప్పులు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.  ఇది ఇలా ఉండగా పవన్ తన అజ్ఞాతవాసానికి తాత్కాలికంగా విరామం ప్రకటించి జనసేనాధిపతిగా జనం ముందుకు రావడానికి యాక్షన్ ప్లాన్ ప్రకటించాడు. తెలంగాణలోని కొండ గట్టు నుంచి తన జనచైతన్య యాత్రకు శ్రీకారం చుడుతున్నాని యాత్ర ఎలావుంటుంది ? విధి విధానాలు ఏమిటి అన్నది రూట్ మ్యాప్ ఏమిటన్నది త్వరలో ప్రకటిస్తాను అంటూ పవన్ నిన్న రాత్రి ట్విట్ చేయడంతో అజ్ఞాతం నుండి పవన్ త్వరలోనే జనం మధ్యకు రాబోతున్నాడని తెలుస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: