బాలీవుడ్ లో చాన్స్ వస్తే..నో అన్నాడు..!

shami
టాలీవుడ్ ఇండస్ట్రీలో లక్కీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో నేచురల్ స్టార్ నానీ ఒకరైతే ఈ మద్య ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ ని కూడా ఆకర్షించాడు విజయ్ దేవరకొండ.  ఇక తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలు దక్కించుకున్న విజయ్ దేవరకొండ త్వరలో కోలీవుడ్ లో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో తొలి హిట్ ను అందుకున్న విజయ్ దేవరకొండ, 'పెళ్లి చూపులు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 

ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన   'అర్జున్ రెడ్డి'  సినిమాతో ఆయన క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో హిందీ నుంచి విజయ్ దేవరకొండకు భారీ ఆఫర్ వచ్చిందట. బాలీవుడ్లో భారీ సంస్థగా చెప్పుకునే యష్ రాజ్ ఫిలిమ్స్ వారు, విజయ్ దేవరకొండతో వరుసగా 3 సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు. అయితే ఈ ఆఫర్ ను విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించినట్టుగా సమాచారం.

అయితే దీనికి కారణం డీల్ ఓకే అంటే ఆ మూడు సినిమాలు పూర్తయ్యేవరకూ మరో సినిమా చేయడానికి ఉండదట. అందువలన ఈ డీల్ విషయంలో విజయ్ దేవరకొండ ఆసక్తిని చూపించలేదని తెలుస్తోంది.  ఇప్పటికే తెలుగు లో రెండు మూడు సినిమాలతో పాటు తమిళంలో కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: