పైరసీలో సినిమా చూస్తరా..సిగ్గు సిగ్గు..!

Edari Rama Krishna
హీరో విజయ్ నటించిన ‘మెర్సిల్’ అద్భుతమైన విజయం సాధించడంతో పాటు దుమ్మురేపే కలెక్షన్లతో రికార్డులు సాధిస్తుంది. ఓ వైపు కలెక్షన్లు సాధిస్తున్నా..మరో వైపు సినిమాపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి.   తమిళనాట ఇప్పుడు ఎక్కడ చూసినా ‘మెర్సల్‌’ చిత్రానికి సింబంధించిన వివాదమే నడుస్తుంది.  ముఖ్యంగా ఈ చిత్రంలో జీఎస్టీ వ్యతిరేక డైలాగులు ఉన్నాయని..దాని వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతింటుందని కొంత మంది బీజేపీ నేతలు సినిమాపై సిషేదం విధించాలని వాదిస్తున్నారు. 

మరోవైపు ప్రజలకు ఆరోగ్య విషయమై భద్రత కోసం ఆ డైలాగులు రాశామే తప్ప, కేంద్ర విధానాన్ని తప్పుబట్టే ఉద్దేశాలు తమకు లేవని నిర్మాత రామినేని ప్రకటించారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ కి దక్షిణ చెన్నై బీజేపీ విభాగానికి చెందిన సీనియర్‌ నేత సిధార్త్‌ మణి మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తుంది.   మెర్సల్‌లో జీఎస్టీ వ్యతిరేక డైలాగులు తప్పేం కాదని చెప్పారు. అది చిత్ర యూనిట్‌ అభిప్రాయం. సినిమా మూలంగా గౌరవం దెబ్బతింటుందన్న వాదన అస్సలు సరికాదు.

అనవసరంగా పార్టీకి ఆపాదించి ఈ సమస్యను కొందరు పెద్దది చేశారు అంటూ ఆయన సొంత పార్టీ నేతలపైనే మండిపడ్డారు. తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హెచ్‌ రాజాపై హీరో విశాల్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.  బీజేపీ అధ్యక్షుడు హెచ్‌ రాజా తాను మెర్సల్‌ సినిమా పైరసీ కాపీని చూశానని, అందులోని డైలాగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పటంపై ఇప్పడు పెద్ద వివాదం చెలరేగింది. 

ఈ నేపథ్యంలో విశాల్‌ ఓ ప్రకటన విడుదల చేశాడు. ఓ జాతీయ నేత అయి ఉండి ఇలా చట్ట వ్యతిరేకంగా ఉన్న పైరసీని ప్రొత్సహించటం దారుణమన్నాడు. పైగా సినిమాను పైరసీలో చూశానని చెప్పటం మరింత ఘోరమని విశాల్‌ పేర్కొన్నాడు.పైరసీ చూశానని చెబుతున్నారు. సిగ్గు లేదా?’’ అంటూ ఘాటుగా రాజాకు చురకలంటించాడు. 
#SayNoToPiracy pic.twitter.com/WPpgnF2dKj

— Vishal Film Factory (@VffVishal) October 22, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: