డ్రగ్స్ పై తాప్సీ వింత వ్యాఖ్యలు !

Seetha Sailaja
ఈమధ్య తాప్సీ చేస్తున్న వ్యాఖ్యలు మీడియాకు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావును టార్గెట్ చేస్తూ మీడియాకు హైలెట్ అయిన తాప్సీ ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారం పై స్పందించింది. తాను డ్రగ్స్‌ను కేవలం సినిమాల్లో మాత్రమే చూశానని తాప్సీ చెపుతోంది.

అంతేకాదు సినిమా వాళ్లంటే పార్టీలకు వెళుతుంటారని అందరూ అనుకుంటారని  కానీ తనను పార్టీలకు ఎవరూ తీసుకెళ్లరని తన సొంత చెల్లి కూడా తనను ఎప్పుడూ పార్టీకి తీసుకెళ్లలేదని తాప్సీ అంటోంది. అదేవిధంగా తాను పార్టీ కల్చర్ కు సరిపోనని దీనికి కారణం తాను డ్రింక్ చేయనని స్మోక్ చేయనని ఈ సొట్ట బుగ్గల సుందరి చెపుతోంది. 

తాను డ్రగ్స్ గురించి ‘సినిమాల్లో చూశాను. బయట విన్నాను. కానీ డ్రగ్స్‌ను ఎందుకు తీసుకుంటారో తనకు అర్థం కాదు’ అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది తాప్సీ.  డ్రగ్స్ తీసుకుంటే సంతోషంగా ఫీలవుతారా? లేక బాధ నుంచి బయటపడతారా? డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది? అని ఎంతో మందిని తాను అడిగినా ఎవరూ కరెక్ట్ సమాధానం చెప్పలేదు అంటూ డ్రగ్స్ విషయంలో తన అజ్ఞానాన్ని బయట పెట్టింది తాప్సీ.

అయితే డ్రగ్స్ తీసుకునే వారిని ఎవరైనా  డ్రగ్స్ తీసుకుంటుంటే వద్దని ఒకటికి రెండు సార్లు చెబితే వాళ్ళు విని మానివేసే అవకాసం ఉంది అని అంటోంది. దీనినిబట్టి చూస్తూ ఉంటే డ్రగ్స్ బాదితుల కోసం ఒక మానసిక వికాస కేంద్రాన్ని త్వరలో తాప్సీ మొదలు పెట్టినా ఆశ్చర్య పడనవసరం లేదు.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: