‘ఫిదా’ బాక్సాఫీస్ కలెక్షన్లు అదుర్స్..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో..మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ‘ముకుంద’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘కంచె’ చిత్రంతో మరో అద్భుతమైన విజయం సాధించాడు.  అయితే మాస్ ఎలిమెంట్స్ తో కూడుకున్న చిత్రం ‘లోఫర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొర్లా పడింది. ఆ తర్వాత వచ్చిన ‘మిస్టర్’ చిత్రం కూడా అపజయం కావడంతో వరుణ్ తేజ్ కెరీర్ పై రక రకాల రూమర్లు రావడం మొదలయ్యాయి.

 అయితే తన తదుపరి చిత్రం మంచి సక్సెస్ అయితే కాని ఇండస్ట్రీలో తనకంటూ ఇమేజ్ రాదని భావించిన వరుణ్ ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ములను నమ్ముకొని ‘ఫిదా ’ చిత్రంలో నటించాడు.  అందరి ఊహలు నిజం చేస్తూ..రిలీజ్ రోజు నుంచి ఫిదా అన్ని సెంటర్లలో హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు కలెక్షన్లు కూడా బాగా రాబడుతుంది.  వరుణ్ తేజ్ ఎన్నారైగా నటించిన ఈ సినిమాలో తెలంగాణా అమ్మాయిగా సాయి పల్లవి తన సహజ నటనతో ఆకట్టుకుంది. ఇక మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఈ వీకెండ్ లోనే 1 మిలియన్ డాలర్ కలక్షన్స్ వసూలు చేసేలా పరిస్థితులు కనబడుతున్నాయి.

 ఇక ఓవర్సీస్ లో 113 సెంటర్స్ లో సినిమా రిలీజ్ అవగా శుక్రవారం రోజునే 2,16,000 డాలర్లు వసూలు చేయడం విశేషం. ఇది వరుణ్ తేజ్ కెరీర్ లో అత్యంత పెద్ద సక్సెస్ అని మెగా ఫ్యాన్స్ తెగ సంతోషంలో ఉన్నారు. శేఖర్ కమ్ముల మార్క్ సినిమాగా వచ్చిన ఫిదా ఎంతో సహజమైన కథ కథనాలతో ఆకట్టుకున్నారు. శుక్రవారం ప్రీమియర్స్ తో కలిసి 3,00,000 డాలర్స్ వరకు వచ్చాయని తెలుస్తుంది. ఇక మరో పక్క ఫుల్ రన్ లో సినిమా ఓవర్సీస్ లోనే 1.5 మిలియన్ డాలర్స్ వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


ఫిదా బాక్సాఫీస్ కలెక్షన్లు :


నైజాం : 1.41 Crore


సీడెడ్ 40 Lakhs


ఉత్తరాంధ్ర 41.98 Lakhs


ఈస్ట్ 31.53 Lakhs


వెస్ట్ 17.5 Lakhs


కృష్ణ 21.98 Lakhs


గుంటూరు 35 Lakhs


నెల్లూరు 12.25 Lakhs


ఏపీ + నైజాం : 3.41 Crore 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: