పవన్ స్పూర్తి తో బాహుబలి 2 లో సన్నివేశం !

Seetha Sailaja
గొప్ప చిత్రాలు యధాలాపంగా రావు. ఎంతో మేధోమధనం చేసిన తరువాత మాత్రమే అటువంటి గొప్ప చిత్రాలు పుట్టుకు వస్తాయి. ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రికార్డులను క్రియేట్ చేస్తూ సంచనలాలు సృష్టిస్తున్న ‘బాహుబలి 2’ సన్నివేశాల రూప కల్పనలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పూర్తి ఉంది అంటే ఎవరు నమ్మరు. అయితే ఈవిషయం వాస్తవం అని అంటున్నాడు ‘బాహుబలి’ కథ సృష్టి కర్త విజయేంద్రప్రసాద్. ఈ రోజు ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాన్ని లీక్ చేసాడు బాహుబలి సృష్టికర్త.

‘బాహుబలి 2’ లో వచ్చే ఒక సన్నివేశంలో ప్రత్యక్షంగా పవన్ తో సంబంధం లేకున్నా పవన్ మ్యానియాతో అల్లుకున్న దృశ్యాలే ‘బాహుబలి 2’ ఇంటర్వెల్ సీన్లుగా మారాయి అని అంటున్నాడు విజయేంద్రుడు. ఇదే సందర్భంలో ఈయన మాట్లుడుతూ ‘బాహుబలి 2’ లో ప్రేక్షకుడ్ని కట్టిపారేసిన సీన్లలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి అని చెపుతూ స్క్రీన్ మీద ‘మహీష్మతి ఊపిరి తీసుకో’ అంటూ విశ్రాంతికి బదులుగా వచ్చిన మాటలకు ముందు వచ్చిన ఉద్వేగభరిత సీన్లు డిజైన్ చేయడంలో తన పై పవన్ మ్యానియా ప్రభావం చూపించింది అని చెప్పాడు ఈ ప్రముఖ రచయిత. 

"బాహుబలి 2’ ఇంటర్వెల్ సీన్ ఎలా ఉండాలన్న విషయం పై తనకు తన కొడుకు రాజమౌళికి చాలా చర్చలు జరిగిన నేపధ్యాన్ని గుర్తుకు చేసుకుంటూ పవన్ స్పూర్తికి సంబంధించిన విషయాలను లీక్ చేసాడు.  భళ్లాల దేవుడికి పట్టాభిషేకం జరిగినా అతడికి ‘బాహుబలి’ కి జనం పడుతున్న నీరాజనాలు చూసి ఆసూయతో భల్లాల దేవుడు రగిలిపోయే  సీన్ ను ఎలా చిత్రీకరించాలి అన్న విషయమై ఎన్నో ఆలోచనలు వచ్చిన నేపధ్యంలో ఆ సమయంలో అనుకోకుండా టీవీలో చూసిన ఆడియో ఫంక్షన్ లో జరిగిన పవన్ నామ స్మరణ తనను ఎంతో ప్రభావితం చేసిన నేపధ్యాని గుర్తుకు చేసుకున్నాడు. 

‘ఆ ఆడియో ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ అక్కడ లేడు కానీ పవన్ పేరు పలికినప్పుడల్లా జనం వెర్రిగా వూగిపోతున్నారు. ఐదునిమిషాల పాటు ఎవరేం మాట్లాడినా వినిపించటం లేదు. ఆ సమయంలో ఎవరున్నా చివరకు హీరో ఎవరైనా సరే అసూయ పడాల్సిందే’ దీనితో ఇదేదో బాగుంది కదా అనిపించి వెంటనే  ‘బాహుబలి 2’ఆ ఇంటర్వెల్ సీన్ ను ఆ విధంగానే రాస్తూ బాహుబలి అక్కడ లేకపోయినా జనం బాహుబలి నామస్మరణ చేసినట్లు ఆ సన్నివేశాన్ని  డిజైన్ చేసినట్లు విజయేంద్ర ప్రసాద్ చెపుతూ పవన్ స్పూర్తికి సంబంధించిన విషయాలను బయటపెట్టాడు. 

చరిత్ర సృష్టిస్తున్న ‘బాహుబలి 2’ ఘనవిజయం వెనుక పవన్ స్ఫూర్తి ఉంది అని విజయేంద్ర ప్రసాద్ ఎటువంటి మొహమాటం లేకుండా బయటకు చెప్పడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడ ‘బాహుబలి 2’ తమ హీరో సినిమాగా భావిస్తే ఈమూవీ కలక్షన్స్ ఎక్కడికి వెళ్ళిపోతాయో ఊహలకు కూడ అందని విషయం..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: