బాలీవుడ్ నటిని లైంగికంగా వేధించాడా..!

Edari Rama Krishna
ఈ మద్య సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంత మంది హీరోయిన్లు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు.  మళియాళ నటి భావన గత కొంత కాలంగా ఎంతో నమ్మకంగా పనిచేస్తూ వచ్చిన ఆమె కారు డ్రైవర్ ఆమెకు కిడ్నాప్ చేసి రెండు గంటల పాటు లైంగిక వేధింపులకు గురి చేసి నరకం చూపించాడు.  అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న మళియాళ ఇండస్ట్రీ, నటి భావన ఆ దుర్మార్గుడికి శిక్షపడేలా చేసింది.  తర్వాత కొంత మంది హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలో పెద్దలు కొంత మంది లైంగిక దాడులు ఎలా చేశారో వివరించారు.  

నటి కస్తూరి అయితే ఏకంగా ఓ పెద్ద హీరో తన పడకగదికి రమ్మని వేధించే వాడని కాదు అన్నందుకు సినిమా చాన్సులు లేకుండా చేశాడని ఆరోపించింది.  తాజాగా మరో బాలీవుడ్ నటికి ఇలాంటి చేదు అనుభవం జరిగింది..కాకపోతే   ఆ గండం కొద్దిలో తప్పిపోయిందట.  వివరాల్లోకి వెళితే బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆలియా తన మిత్రుడు మరియు కో-స్టార్ సిద్ధార్త్‌ మల్హోత్రా ఇంటి నుంచి అర్ధరాత్రి తన ఇంటికి కారులో బయల్దేరిందట. కారులో వెనుక సీటులో అలియా పక్కన ఆమె బాడీగార్డ్‌ కూర్చున్నాడట.

ఆ సమయంలో మనోడు మద్యం సేవించి ఉండటంతో పక్కన కూర్చున్నది హీరోయిన్ అన్న సంగతి మర్చిపోయి అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడట.  దీంతో కాస్త పక్కకు జరిగి కూర్చున్న ఆలియా పై చేయి వేయడం అసభ్యంగా మాట్లాడటం చేశాడట.   దీంతో ఆమెకు ముచ్చెమటలు పట్టి… వణుకు పుట్టిందట. కానీ ఆ సమయంలో తన బాడీగార్డుపై కోపగించుకుంటే విషయం మరింత సీరియస్ అవుతుందని గ్రహించి ఇంటికి వచ్చే వరకు ఊపిరి బిగబట్టుకుని కూర్చుందట. ఇంటికి వచ్చి జరిగిన విషయం తల్లికి చెప్పిందట. దీంతో ఆమె వెంటనే సదరు బాడీగార్డ్‌ ను పనిలో నుంచి తీసేసిందట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: