సూపర్ స్టార్ పై పవర్ స్టార్ సంచలన వ్యాఖ్య..!

Edari Rama Krishna
ఇదేంటీ సూపర్ స్టార్ పై పవర్ స్టార్ సంచలన వ్యాఖ్య చేయడం ఏమిటా అనుకుంటున్నారు..సినిమా ఇండస్ట్రీ అంటే పాపులారిటీ కోసం  ఎంతపనైనా చేస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత సినీరంగం, రాజకీయ రంగాల్లో సెలబ్రెటీస్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక సూపర్ స్టార్ పై పవర్ స్టార్ ఆ... మీరనుకుంటున్నట్లు పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ అనుకోకండి, అలా అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే సుమండీ..! పవర్ స్టార్ మన తెలుగు పవర్ స్టార్ కాదు, తమిళంలో కూడా ఒక పవర్ స్టార్ ఉన్నాడు.


ఈయన గారు తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా తెలియకపోయినా..తమిళ ఇండస్ట్రీ వారికి బాగా తెలుసు..ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక సంచలన వాఖ్యలు చేస్తూ తనను తాను పవర్ స్టార్ గా ప్రకటించుకున్న కమెడియన్. ఒక రకంగా చెప్పాలంటే.. ఇక్కడ మనకి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఎలాగో అక్కడ పవర్ స్టార్ శ్రీనివాసన్ అలాగన్నమాట.


ఇక రజినీ గురించి మాట్లాడుతూ..ఆయన అంటే ఎంతో గౌరవమని ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్.. హార్డ్ వర్క్.. పట్టుదల ఈ స్థాయికి చేర్చాయి. ఆయన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి. ఎంతో కష్టపడ్డారు. నేను కూడా ఆయన్నే ఫాలో అవుతున్నా. ఆయనొక్కడిని మాత్రమే నా కాంపిటీటర్ గా భావిస్తున్నా అంటున్నాడు ఈ తమిళ పవర్ స్టార్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: