రికార్డ్స్ క్రియేట్ చేసినా వాళ్ళకి మాత్రం నష్టాలే!
మహేష్ నటించిన ఐదు సినిమాలు యూఎస్ బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ కలెక్షన్స్ సాధించాయి. ఇప్పుడు వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ కూడా 1 మిలియన్ డాలర్ మార్క్ ను దాటింది. అయితే ఇది మహేష్ కి రికార్డ్ ని తీసుకురాగా, ఆ మూవీని కొన్ని డిస్ట్రిబ్యూటర్ కి మాత్రం లాభాలను తీసుకురాలేకపోవచ్చు అని అంటున్నారు. అలాగే డొమెస్టిక్ మార్కెట్ లోనూ బ్రహ్మోత్సవం మూవీ భారీ రికార్డ్స్ ని సొంతం చేసుకుంటుంది.
ఇప్పటి వరకూ ఏ మూవీకి సొంతం కాని ఓపెనింగ్ డే కలెక్షన్స్ ని, బ్రహ్మోత్సవం మూవీ సొంతం చేసుకుంది. అయితే లాంగ్ రన్ లో మాత్రం బ్రహ్మోత్సవం మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఆశించినంత ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. చాలా చోట్ల భారీ రేటుకి కొన్ని డిస్ట్రిబ్యూటర్స్ కి కొంత మేర నష్టం వాటిల్లే ఛాన్స్ ఉందని అంటున్నారు.
బ్రహ్మోత్సవం మూవీకి భారీగా నెగిటివ్ పబ్లిసిటీ రావటమే ఇందుకు కారణం అని అంటున్నారు. అయితే ప్రస్తుతం కలెక్షన్స్ వేటలో ఉన్న ఈ మూవీ, మొదటి వారాంతరం కలెక్షన్స్ తరువాతనే, ఎవరికి ఎంత నష్టాలు అనే విషయం బయటకు రానుందని అంటున్నారు.