జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ పై సంపూ షాకింగ్ పంచ్ !

Seetha Sailaja
నిన్న సాయంత్రం విడుదల అయిన  “జనతా గ్యారేజ్”  ఫస్ట్ లుక్  జూనియర్ అభిమానులను జోష్ లో ముంచి వేస్తూ ఉంటే ఈ ఫస్ట్ లుక్ ను టార్గెట్  చేస్తూ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తనదైన శైలిలో వేసిన  పంచ్ జూనియర్ అభిమానులకు షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పడు ఈ ట్విట్ వెబ్ మీడియా కు హాట్ టాపిక్ గా మారింది. 

జూనియర్ ఎన్టీఆర్ ‘బృందావనం’ సినిమాలో బాగా పాపులర్ అయిన డైలాగ్ ను అనుకరిస్తూ “సైడ్ యాంగిల్ లో ఉన్నాడు, సైడ్ అయిపోతాడేమో అనుకున్నారేమో, నేరుగా ఫేస్ చేసే దమ్ము నీకోచ్చినప్పుడు విశ్వరూపమే” అంటూ ట్వీట్ చేసి జూనియర్ అభిమానులను మరింతగా ఉత్సాహపరిచాడు సంపూ. ఈ సినిమా ద్వారా జూనియర్ రికార్డులను క్రియేట్ చేయబోతున్నాడు అన్న సంకేతాలను ఇచ్చాడు సంపూ. 

ముదురు గడ్డంతో బైక్ పైన ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెష్ లుక్ తో పాటు, టైటిల్ లోగో మరియు ‘ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును’ అనే ట్యాగ్ లైన్ అదిరిపోయాయని ఫ్యాన్స్ పండగ  చేసుకుంటూ ఉంటే జూనియర్ విమర్శకులు మాత్రo నాన్నకు ప్రేమతో సినిమాలోని జూనియర్ లుక్ ని కొద్దిగా మార్చి మళ్ళీ చూపెడుతున్నారు విశేషం ఏముంది అని కామెంట్ చేస్తున్నట్లు టాక్. అయితే ఈ ఫస్ట్ లుక్ లో జూనియర్ ధరించిన కాస్ట్యూమ్స్ గతంలో మరెన్నడూలేని విధం గా ఉండటంతో  జూనియర్ అభిమానులు మంచి జోష్ పై ఉన్నారు. 

ఒక పాతకాలపు గ్యారేజ్ తాలూకు బోర్డును ఒక ఆర్టిస్ట్ చేత్తో రాస్తే ఎలా ఉంటుందో అలా ఈ ఫస్ట్ లుక్ డిఫరెంట్ గా కనిపిస్తోంది అన్న కామెంట్స్ కుడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న మోహన్ లాల్  ను హైలైట్  చేస్తూ ఈ సినిమాకు సంభందించి జూనియర్ మోహన్ లాల్ లకు సంబంధించిన మరో ఫస్ట్ లుక్ ను కూడ ఈ రోజు విదుదల చేయబోతున్నారు అని టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: