బాలయ్య ప్రకటనతో షాక్ లో చిరంజీవి !

Seetha Sailaja
నిన్న ఒకవైపు చిరంజీవి తన ‘కత్తిలాంటోడు’ సినిమా ప్రారంభాన్ని తన సన్నిహితులు బంధుమిత్రులు మధ్య ఆనందంగా జరుపుకుంటూ ఉంటే అదేరోజు షుమారు అదే సమయానికి నందమూరి సింహం బాలకృష్ణ తన 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. 

ఈసినిమాను జనవరి 12, 2017న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు బాలయ్య స్వయంగా ఇంకా సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే ప్రకటించడం వెనుక చిరంజీవి 150వ సినిమాను కార్నర్ చేయడానికే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈరోజు వినాయక్ ‘కత్తిలాంటోడు’ సంక్రాంతికి విడుదల అవుతుంది అని మీడియాకు లీకులు యిచ్చిన  కొద్ది సేపటికే బాలయ్య ప్రకటన రావడంతో రానున్న సంక్రాంతికి అధికారికంగా నందమూరి కొణిదల వార్ కు రంగం సిద్ధం అయింది అనుకోవాలి. 

సంక్రాంతి పండుగకు ఇద్దరు టాప్ హీరోల సినిమాలు పోటీగా విడుదల కావడం ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయమే అయినా ఈసారి చరిత్రకు ఎక్కబోతున్న చిరంజీవి 150 వ సినిమా బాలయ్య 100వ సినిమాతో పోటీ పడటం ఎవరూ ఊహించని సంచలన విషయం. అయితే చిరంజీవి నటిస్తున్న ‘కత్తిలాంటోడు’ రొటీన్ సినిమా కావడంతో ఈసినిమాను వేగంగా పూర్తి చేయడానికి ఎటువంటి సమస్యలు ఉండవు. కాని బాలయ్య 100వ సినిమా మాత్రం పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్ తో కూడుకున్న విషయం కాబట్టి బాలయ్య స్పీడ్ కు దర్శకుడు క్రిష్ అందుకోగలడా అన్నదే  ప్రశ్న. 

ఈ వార్తలు ఇలా ఉండగా బాలకృష్ణ ‘గోతమీపుత్ర శాతకర్ణి’ సినిమా షూటింగ్ మే 9వ తారీఖు నుండి మొరాకోలో ప్రారంభం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అక్కడ ఈసినిమాకు సంబంధించిన యుద్ధ సన్నివేశాలను  భారీ స్థాయిలో తీయబోతున్నారు. అయితే ఈ రెండు భారీ సినిమాల రిలీజ్ డేట్లు ఒకేరోజు మీడియాకు లీక్ అవడంతో ఇప్పుడు అందరి దృష్టి బాలకృష్ణ చిరంజీవిల  మధ్యన జరగబోయే వార్ పైనే ఉంది..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: