హెచ్చరికల నేపధ్యంలో రాజ్ తరుణ్ కెరియర్ !

Seetha Sailaja
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ సినిమా రంగానికి వచ్చి దర్శకుడు అవ్వాలనుకుని క్రేజీ యంగ్ హీరోగా మారిపోయిన రాజ్ తరుణ్ కెరియర్ పై ఆ సక్తికర కామెంట్స్ వినిపిస్తున్నాయి. వరసగా మూడు హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ డేట్స్ కోసం చాలామంది దర్శక నిర్మాతలు క్యూ కడుతూ ఉంటే ఎన్నో హిట్ సినిమాలను అందించిన రామ్ గోపాల్ వర్మ లాంటి టాప్ డైరెక్టర్లు రాజ్ తరుణ్ భజన చేయడం చూస్తూ ఉంటే ఇది అంతా రాజ్ తరుణ్ ఊహించని అదృష్టమా ? లేదంటే ఈ యంగ్ హీరోకు అంత టాలెంట్ ఉందా ? అని చాలామంది ఆశ్చర్య పడుతున్నారు. 

నిన్నటి దాకా జూనియర్ రవితేజాగా  టాలీవుడ్ లో పిలిపించుకున్న ఈ యంగ్ హీరోను ఈవారం విడుదలైన ‘కుమారి 21 ఎఫ్’ హిట్ టాక్ తెచ్చుకోవడంతో టాలీవుడ్ విశ్లేషకులు రాజ్ తరుణ్ ను టాలీవుడ్ ధనుష్ గా పోలుస్తూ కామెంట్స్ చేయడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. హీరోకి కావలసిన ఎటువంటి లక్షణాలు లేకపోయినా కోలీవుడ్ లో ధనుష్ ఎలాంటి క్రేజ్ ను సంపాధించుకున్నాడో టాలీవుడ్ లో కూడ రాజ్ తరుణ్  అలాంటి క్రేజ్ సంపాధించుకోవడం ప్రస్థుతానికి హాట్ టాపిక్. 

గతంలో ఇటువంటి క్రేజ్ ను తరుణ్, ఉదయ్ కిరణ్ లు తాము నటించిన అతి తక్కువ సినిమాలతో అందుకున్నా ఆ క్రేజ్ ను తమ సినిమాల  కెరియర్ కు సంబంధించి శాస్వితంగా కొనసాగించ లేకపోయారు. దానితో టాప్ హీరోల స్థాయికి ఎదిగిపోతారు అని అనుక్కున్న ఉదయ్ కిరణ్ తాను చేసిన పొరపాట్లతో ఈ లోకం నుండి శాస్వితంగా వెళ్ళిపోతే తరుణ్ ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో వ్యాపారాలు చేసుకుంటున్నాడు. 

వీరిద్దరూ ఇలా వారివారి కేరియర్లలో ఎదగలేక పోవడానికి గల కారణం వారి ఇమేజ్ కు భిన్నంగా మాస్ హీరోలుగా ఎదగడానికి చేసిన పొరపాట్లే అనే కామెంట్స్ ఉన్నాయి. అయితే రాజ్ తరుణ్ కు అనుకోకుండా వచ్చిన ఈ అదృష్టాన్ని నిలుపుకోవాలి అంటే కేవలం పారితోషికం మాత్రమే చూసుకోకుండా మంచి సినిమాలను మంచి దర్శక నిర్మాతలను జాగ్రత్తగా ఎంచుకుంటే టాలీవుడ్ కు మరో మంచి యంగ్ హీరో లభించినట్లే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫిలింనగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ‘కుమారి 21 ఎఫ్’ మొదటి వారం పూర్తి అయ్యే సరికి 10 కోట్ల కలక్షన్స్ రేంజ్ ని చేరుకుంటుంది అని అంటున్నారు.  అయితే ఈ విశ్లేషకుల హెచ్చరికలు ఈ యంగ్ హీరో ఎంత వరకు గ్రహిస్తాడో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: