జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా అరవింద సమేత వీర రాఘవ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆరేళ్లు పూర్తయ్యాయి.తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన సోలో హీరోగా వస్తున్న దేవర సినిమా మీద భారీ అంచనాలున్నాయి. కొరటాల శివ ఆచార్య తర్వాత చేస్తున్న సినిమా కావడం, జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకు పెరుగుతూ వెళ్లాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్ కట్స్ సినిమా మీద అంచనాలను మరింత పెంచగా ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి సుమారు 500 పైగా షోస్ ఇండియాలో పడగా అమెరికాలో కూడా దాదాపుగా చాలా ప్రీమియర్స్ పడ్డాయి.ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య విడుదలైన దేవర సినిమా పై మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి.దేవర సినిమాపై ఆచార్య మూవీ ఎఫెక్ట్ పడిందో ఏమో తెలియదు కానీ దేవర గురించి చాలామంది సినిమా చూసిన అభిమానులు కొరటాల చెప్పిన పని చేసి చూపించలేకపోయాడు. ఎన్టీఆర్ అభిమానులు కాలర్ ఎగరేసుకోనేలా తిరుగుతారు అని చెప్పి తలదించుకునేలా చేశాడు అంటూ రివ్యూలు ఇస్తున్నారు. అయితే ఈ సినిమా చూసిన అభిమానులు నిరాశ చెందడానికి కొరటాల డైరెక్షనే కారణమని కొంతమంది అంటున్నారు.అయితే ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అయ్యారు కాబట్టి ఆయన్ని అందరూ ఆ రేంజ్ లోనే చూస్తారు. సినిమాలో స్క్రీన్ ప్లే మ్యాజిక్ కనిపించలేదని, ఎలివేషన్స్ కూడా అంత బాగా లేవని అంటున్నారు. ఇక అలాగే సినిమాకి ముందు విడుదలైన పాటలన్నీ మంచి వ్యూస్ సంపాదించాయి.
కానీ సినిమాలో పాటలకు కాస్త హైప్ కూడా ఉండేటట్లు చూసుకోలేదు.కథ లేదు కథనం మీద ఎలాంటి కసరత్తు లేదు ఎన్టీఆర్ కి తగ్గ డైలాగులు కూడా లేవు.దర్శకుడిగా కొరటాల శివ ఫెయిల్ అయ్యాడు.మంచి పాటల ఆల్బమ్ కూడా కొరటాల శివ తీసుకోలేకపోయాడు అంటూ సినిమా చూసిన జనాలు కొరటాల శివ పై ఫైర్ అవుతున్నారు.ఇక ఎన్టీఆర్ కూడా కాస్త మిస్టేక్ చేసినట్టు అభిమానులు అంటున్నారు. ఎందుకంటే రాజమౌళి డైరెక్షన్లో మూవీ చేశారు కాబట్టి ఆయన్ని ఆ రెంజ్ లోనే చూస్తారు.ఇక పాన్ ఇండియా కథ అని చెప్పారు కానీ కథా కథనం బాగుందా లేదా అని ఎన్టీఆర్ చూసుకోలేకపోయారు. అలాగే ఆ స్టోరీని అసలు రెండు పార్ట్ లుగా తీయవచ్చా లేదా అని కూడా ఆలోచించ లేకపోయారు అంటూ సినిమా చూసిన జనాలు ఎన్టీఆర్ ను కూడా నిందిస్తున్నారు.ఎడిటింగ్ పర్లేదు.. కానీ మూడు గంటల నిడివి కాస్త ఇబ్బంది పెట్టే విషయమే. కాస్త ట్రిమ్ చేసుంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. దర్శకుడిగా కొరటాల శివ ఓ సీరియస్ కథను చెప్పాలనుకున్నాడు.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బుర్రలో ఉన్న ఆలోచనను స్క్రీన్ మీద సిన్సియర్‌గా పెట్టాడు. దానికోసం ఎక్కడా కమర్షియల్ పంథాలో వెళ్లలేదు. తను చెప్పాలనుకున్న కథనే కమర్షియలైజ్ చేసాడంతే. రైటర్‌గా అదరగొట్టిన శివ.. డైరెక్టర్‌గా ఇంకాస్త మెరిసుంటే దేవరకు తిరుగుండేది కాదు.ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు సినిమా పై కొంత నిరాశగవున్నారు. దేవర కన్నా ఆంధ్రవాలా, దమ్ము బెటర్ అన్నట్టు ఓ అభిమాని ఎన్టీఆర్ పై వున్నా అభిమానం తో తన మనసులో మాటను ఈ విధంగా వ్యక్తపరిచాడు.