సాయిరామ్ శంకర్ మార్క్ మూవీ "వెయ్ దరువెయ్"

Chakravarthi Kalyan
గతంలో సాయిరామ్ శంకర్ నటించిన 143, బంపర్ ఆఫర్ చిత్రాలు ప్రేక్షకులను ఎలా అలరించాయో తెలిసిందే. ఆయన మార్కు మరో చిత్రం ‘వెయ్ దరువెయ్’. ఇందులో సాయిరామ్ శంకర్ సరసన యషా శివకుమార్, హెబ్బా పటేల్ నటించారు. లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నూతన దర్శకుడు నవీన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని దేవరాజ్ పోతూరు నిర్మించారు.
కథ: తెలంగాణాలోని కామారెడ్డిలో సరదాగా తిరిగే కుర్రాడు కామారెడ్డి శంకర్(సాయిరామ్ శంకర్)... ఏదైనా ఉపాధి పొందాలని హైదరాబాద్  సిటీకి వస్తాడు. అక్కడ తన స్నేహితుడి(సత్యం రాజేష్)తో కలిసి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే అతనికి పెద్దగా క్వాలిఫికేషన్ ఏమీ లేకపోవడంతో ఏదైనా డిగ్రీ ఫేక్ సర్టిఫికేట్ ను తీసుకొని జాబ్ చేయాలనుకుంటాడు. అలా ఫేక్ సర్టిఫికెట్ కోసం ప్రయత్నిస్తుండగా... శృతి (యషా శివకుమార్) అతడికి పరిచయమవుతుంది. అది ప్రేమగా మారుతుంది. శృతి కూడా నకిలీ సర్టిఫికేట్ ద్వారానే ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తుంది. మరి కామారెడ్డి శంకర్ కూడా నకిలీ సర్టిఫికేట్ తోనే ఉద్యోగం సంపాదించాడా? అసలు శంకర్ సిటీకి వచ్చింది ఉద్యోగం కోసమా? లేక మరేదైనా ఇతర కారణాలున్నాయా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే...
ఎంటర్టైనింగ్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది.  దానికితోడు ఓ చిన్నపాటి సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ జోడిస్తే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ‘వెయ్ దరువెయ్’ సినిమాలో నూతన దర్శకుడు నవీన్ రెడ్డి కూడా చేసింది అదే. సాయిరామ్ శంకర్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కథ రాసుకుని, ఫ్యామిలీ డ్రామాను జోడించారు. చివర్లో  చిన్న మెసేజ్ కూడా ఇచ్చారు. దురాశ దు:ఖానికి చేటు అనే నీతి సూత్రాన్ని... ఎంటర్టైనింగ్ గా, ఎమోషనల్ గా చెప్పారు. ఫస్ట్ హాఫ్ లో అంతా సత్యం రాజేష్ తో కలిసి సాయిరామ్ శంకర్ చేసే సరదా సరదా సన్నివేశాలు ఉంటాయి. తరువాత ఇంటర్వెల్ బ్యాంగ్ తో సునీల్ వస్తారు. ఈ మధ్య విలనిజంతో విపరీతంగా మెప్పిస్తున్న సునీల్... ఇందులోనూ ఆకట్టుకుంటాడు. సెకెండాఫ్ యాక్షన్, డ్రామాతో ముందుకు తీసుకెళ్లాడు. ఓవరాల్ గా ‘వెయ్ దరువెయ్’ అలరిస్తుంది.
సాయిరామ్ శంకర్ ఎప్పటిలాగే తన ఎనర్జీ చూపించారు. కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ను ఆటపట్టించే సన్నివేశాలు, సత్యం రాజేష్ తో వచ్చే సీన్స్ అన్నీ నవ్విస్తాయి. అలాగే యాక్షన్ సన్నివేశాల్లో ఫుల్ ఎనర్జీ చూపించారు. అతనికి జోడీగా నటించిన యషా శివకుమార్ తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. ఇందులో ఫేక్ సర్టిఫికెట్స్ సప్లై చేసే పాత్రలో నటించిన చిత్ర నిర్మాత దేవరాజ్ మెప్పించారు. అతనికి జంటగా నటించిన గాయత్రి భార్గవి కూడా గృహిణిగా మెప్పించారు. సునీల్ విలన్ పాత్రలో ఎప్పటి లాగే నటించి ఆకట్టుకుంటారు.  
దర్శకుడు నవీన్ రెడ్డి ఎంచుకున్న మెయిన్ ప్లాట్ బాగుంది. దాని చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే ఎంటర్టైనింగ్ గా ఉంది. అయితే ఇంకాస్త బలమైన సన్నివేశాలు, సంభాషణలు రాసుకుని ఉంటే మరింత గ్రిప్పింగ్ గా ఉండేది. దర్శకునికి డెబ్యూ మూవీనే అయినా... ట్రీట్ మెంట్ చేసిన విధానం బాగుంది. భీమ్స్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన మార్కు మ్యూజిక్ ఇందులో కూడా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. సాయిరామ్ శంకర్, యషా శివకుమార్ జోడీని అందంగా చూపించారు. పాటల పిక్చరైజేషన్ చాలా బాగుంది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కూడా సినిమాని నిర్మించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. సరదాగా ఈ వారం సినిమాని చూసేయండి.
రేటింగ్: 2.75

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: