చిన్నదాన నీకోసం : రివ్యూ

ఆండ్రూ సినిమాటోగ్రఫీ,అనూప్ రూబెన్స్ మ్యూజిక్, ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ బిట్స్ఆండ్రూ సినిమాటోగ్రఫీ,అనూప్ రూబెన్స్ మ్యూజిక్, ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ బిట్స్కాపీ కొట్టిన కథ,కథనం ,సెకండాఫ్, ఎడిటింగ్, వల్గర్ గా అనిపించే గే కామెడీ,జస్టిఫికేషన్ మరియు క్లారిటీలేని క్లైమాక్స్చదువు పూర్తి చేసుకొని ఆవారాగా తిరుగుతూ లైఫ్ ని ఎంజాయ్ చేసే కుర్రాడు నితిన్ (నితిన్). సినిమాలో కూడా నితిన్ పవన్ కళ్యాణ్ కి భీభత్సమైన ఫ్యాన్. నితిన్ చేసిన ఓ మంచి పని వల్ల సిటీలో ఫేమస్ బిజినెస్ మాన్ అయిన రెడ్డి(నాజర్) తో నితిన్ కి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అప్పుడే నితిన్ నందిని(మిష్తి చక్రబోర్తి)ని చూసి ప్రేమలో పడతాడు. తను కూడా తన అవసరాలను తీర్చుకోవడం కోసం మరియు రెడ్డితో రిలేషన్ షిప్ పెంచుకోవడం కోసం నితిన్ ని వాడుకుంటుంది. కట్ చేస్తే నందిని రెడ్డిని తీసుకొని బర్సెలోనా వెళ్ళిపోతుంది. అసలు నందినికి రెడ్డికి ఉన్న సంబంధం ఏమిటి.? తనని మోసం చేసి వెళ్ళిపోయిన నందినిపై నితిన్ పగ తీర్చుకున్నాడా.? లేదా.? చివరికి నితిన్ నిజమైన ప్రేమని నందిని గ్రహించిందా.? లేదా అన్నది మీరు తెరపైనే చూడాలి.. నితిన్ వరుసగా రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ చేస్తున్నాడు, కావున ప్రతి సినిమాలోనూ నటన పరంగా పెద్దగా వేరియేషన్ చూపించలేం అని తెలుసుకున్న నితిన్ కనీసం తన లుక్స్ పరంగా డిఫరెంట్ గా కనిపించాలి అని ట్రై చేస్తున్నాడు. లుక్ మరియు స్టైల్స్ విషయంలో మాత్రం నితిన్ మరోసారి సక్సెస్ అయ్యాడు. ఇక నటన పరంగా చూసుకుంటే కథల్లో పెద్దగా మార్పులు లేనప్పుడు నటనలో మాత్రం మార్పు ఎందుకు ఉంటుంది. తన పాత్రకి చాలావరకూ సెటిల్ గా చేసాడు. కానీ కొన్ని చోట్ల అలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటూ చెప్పుకొని ఓవరాక్షన్ చేసాడు. చూసే ఆడియన్స్ ఇమిటేషన్ ఎందుకు రా బాబు, నీకు వచ్చింది చేసుకోవచ్చుగా అంటారు. ఏదైనా కొంతవరకే అందం, అదే మోతాదు మించితే చిరాకు. నితిన్ అలాంటి చిరాకునే తెప్పించాడు. కరుణాకరన్ ప్రతి సినిమాలోనూ హీరోయిన్ కి హీరోతో పాటు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. మిష్తి కి కూడా అటు నటనకి, ఇటు గ్లామర్ కి ఆస్కారం ఉన్న పాత్ర తన మొదటి సినిమాలోనే దక్కడం అదృష్టంగా చెప్పుకోవాలి. మిష్తి లుక్స్ పరంగా అటు మోడ్రన్ గా ఇటు ట్రెడిషనల్ గా సూపర్బ్ గా ఉంది. చాలా చోట్ల ఆడియన్స్ ని తన చూపులతో మత్తెక్కించింది. తెలుగు రాకపోయినా నటన పరంగా మాత్రం చాలా మెచ్యూరిటీ చూపించింది. కానీ ఈ భామకి డాన్సులు అస్సలు రావు అందుకే పాటల్లో కూడా మిష్తిని పక్కన పెట్టేసారు.

వీళ్ళు కాకుండా ఈ సినిమాకి బాగా హెల్ప్ అయిన నటీనటుల్లో చెప్పుకోవాల్సింది తాగుబోతు రమేష్ గురించి.. తాగుబోతు రమేష్ తన బెంచ్ మార్క్ కామెడీతో ఆడియన్స్ ని కాసేపు ఎంటర్టైన్ చేసాడు. అలీ పాత్ర సినిమాలో నవ్వించడానికి కాకుండా ఆడియన్స్ కి బోర్ కొట్టించడానికి ఉపయోగపడింది. ఇకపోతే సినిమాని చెడగొట్టింది మరియు బాబు ఆవగింజంత పెర్ఫార్మన్స్ చెయ్యమంటే అనపకాయ సైజులో నటించి, కాదు కాదు జీవించి ప్రేక్షకులకి చిరాకు పెట్టింది మాత్రం మధు - జోష్ రవిల గే కామెడీ.. సెకండాఫ్ లో వచ్చే వీరిద్దరి గే కామెడీ ట్రాక్ చాలా వరస్ట్ గా ఉంది. దానికి తోడూ వాళ్ళ ఓవరాక్షన్ చూడలేరు బాబోయ్.. సీనియర్ నరేష్ చేసింది చిన్న పాత్రే అయినా ఆయన డైలాగ్స్ రెండు మూడు బాగానే పేలాయి.ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలన్నిట్లో 95% సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్స్ గానే నిలుస్తున్నాయి. కానీ వాటిలో 60-70% సినిమాల్లో హైలైట్స్ ఏంటి అంటే ఎక్కువగా మనకు వినపడేది సినిమాటోగ్రఫీ & మ్యూజిక్. ఆ కోవలోనే ఈ సినిమాకి కూడా ఆండ్రూ సినిమాటోగ్రఫీ, అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్స్ గా నిలిచాయి. ఆండ్రూ తన విజువల్స్ తో చూస్తున్న ఆడియన్స్ కళ్ళకు బార్సెలోనా కొత్త అందాల్ని చూపించాడు. అది కూడా చూసేకొద్దీ చూడాలి అనిపించేలా లోకేషన్స్ ని షూట్ చేసాడు. అలాగే నితిన్ - మిష్తి లను కూడా చాలా బాగా ప్రెజెంట్ చేసాడు. అనూప్ అందించిన ఆల్బంలోని టైటిల్ సాంగ్ మాత్రమే చార్ట్ బస్టర్ అయ్యింది. కానీ పిక్చరైజేషన్, విజువల్స్ పరంగా మాత్రం అన్నీ సూపర్బ్ అనేలా ఉన్నాయి. కానీ సందర్భం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఇకపోతే అనూప్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మనం సినిమాలకు ప్రేక్షకులను మెప్పించేలా సింపుల్ అండ్ మీనింగ్ ఫుల్ డైలాగ్స్ అందించిన హర్షవర్ధన్ ఈ సినిమాకి కూడా చాలా వరకూ డీసెంట్ డైలాగ్స్ నే రాసాడు.

కానీ మన హీరోలు మాస్ ఇమేజ్ అనేదానికోసం కాస్త ఎక్కువ ఆరాటపడుతుంటారు. అందుకోసం రైటర్స్ ని మాస్ డైలాగ్స్ రాయండి అని గొడవ పెట్టేస్తుంటారు. ఇలా జరగడం వల్లేనేమో హర్షవర్ధన్ తన రెగ్యులర్ బౌండరీస్ దాటొచ్చి కొన్ని డైలాగ్స్ రాసాడు. అవేమో తమ గొప్పలు చెప్పుకోవడానికి తప్ప పెద్దగా ఉపయోగపడలేదు, అలాగే సినిమా కథకి అతుకుల బొంతలా తయారయ్యాయి. అందుకే మన పెద్దవాళ్ళు అంటుంటారు., మన డబ్బా మనమే కొట్టుకోకూడదు అని. ఎడిటర్ ప్రవీణ్ పూడి ఫస్ట్ హాఫ్ వరకూ ఓ మాదిరిగా కత్తిరించుకుంటూ వచ్చాడు. కథ చెప్పకపోయినా ఆడియన్స్ బాగానే ఎంటర్ టైన్ ఫీలవుతారు. కానీ సెకండాఫ్ విషయంలో మాత్రం జస్ట్ కెనాట్ అంటారు. ఎందుకంటే సెకండాఫ్ స్టార్ట్ అవ్వగానే మొదటి 5 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేస్తాడు, ఆ తర్వాత అంతా సాగదీయడమే.. దాన్ని ఎడిటర్ ఇంకాస్త సాగదీసి ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టాడు. ఈ సహన పరీక్ష రిజల్ట్ ఆడియన్స్ నోట సినిమా మటాష్ అని రావడం. విజయ్ కంపోజ్ చేసిన ఫైట్ సీక్వెన్స్ లు నితిన్ పర్సనాలిటీకి మించి ఉన్నాయి. ఇలాంటి ఫైట్స్ మన లవర్ బాయ్ ఇమేజ్ కి అవసరమా నటరాజా.!!..

ఇక చెప్పుకోవాల్సింది డైరెక్టర్ కరుణాకరన్ గురించి.. కరుణాకరన్ కూడా అందరిలానే సక్సెస్ కోసం ఓ సూపర్ హిట్ సినిమా కాన్సెప్ట్ ని తిప్పీ రాసేసుకున్నాడు.. అదే పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది'. అక్కడ మనవడు అత్తని తీసుకొచ్చి తన తండ్రితో కలుపుతాడు. ఇక్కడేమో మనవరాలు తాతయ్యని తీసుకొచ్చి తన తల్లితో కలుపుతుంది. అదే కథ.. ఇంతోటి కథ ఎవరైనా రాస్తారు దానికి కరుణాకరన్ ఎందుకు అంట.. ఇకపోతే కథనంలో కూడా సరిగా జాగ్రత్తలు తీసుకోలేదు. ఫస్ట్ హాఫ్ వరకూ ఓకే సెకండాఫ్ లో ట్విస్ట్ రివీల్ చేసి సాగదీసి సాగదీసి ఆడియన్స్ ని థియేటర్స్ నుంచి బయటకి పంపించేసారు. డైరెక్టర్ గా కూడా 50-50 సక్సెస్ అయ్యాడు. సో ఫైనల్ గా కరుణాకరన్ మరోసారి ఫెయిల్యూర్ ప్రోడక్ట్ ని ప్రేక్షకులకి అందించాడు. నితిన్ చేస్తున్న సినిమా లు చూసి ఈ చిత్రాన్ని చూస్తే తిరుగు ప్రయాణం మొదలు పెట్టదేమో అనిపిస్తుంది . తొలిప్రేమ వంటి చిత్రం తీసిన కరుణాకరన్ ఇటువంటి చిత్రాన్ని తెరకేక్కిస్తాడని ఎవరు ఊహించారు . చిత్రం మొదలయిన దగ్గరనుండి ఎక్కడా కథలోకి వెళ్ళలేదు దర్శకుడు అతుకుల బొంతలా తయారయ్యింది చిత్రం . ఇప్పటి వరకు అన్ని చిత్రాలలో వర్క్ అయిన కరుణాకరన్ కామెడీ కూడా ఈ చిత్రం లో బెడిసికొట్టింది. నితిన్ పవన్ కల్యాణ్ అస్త్రం కూడా ఈ చిత్రానికి ప్లస్ అవ్వలేదు. ప్రతీసారి పవన్ కల్యాణ్ ని వాడుకోని హిట్ కొట్టాలన్న ఆలోచన నుండి నితిన్ బయటకి రావాలి.. చిత్రం చివర్లో వచ్చే పెయింటింగ్ సన్నివేశానికి ఈ చిత్రానికి ఒక సంబంధం ఉంది, కానీ ఈ మూవీ వివిధ సన్నివేశాల సమూహారం కావడం, అవన్నీ కలిపితే అంధులో అంధమయిన అమ్మాయి అయ్యింది అన్ని సన్నివేశాలు కలిపిన చిత్రం మాత్రం నాసిరకంగా తయారయ్యింది.. గత చిత్రాలను చూసి నితిన్ ని నమ్మి లేదా కరుణాకరణ్ ని నమ్మి మీరు ఈ సినిమాకి వెళితే మోసపోవడం తధ్యం..

ఈ మధ్య వస్తున్న కొత్త డైరెక్టర్స్ మరియు ఫామ్లోకి రావాలని ట్రై చేస్తున్న సీనియర్ డైరెక్టర్స్ అంతా చేస్తున్న పని ఏమిటంటే ఒక పాత రెగ్యులర్ స్టొరీ తీసుకొని దాన్ని అక్కడక్కడా కొన్ని ఫ్రెష్ సీన్స్ తో రీప్లేస్ చేసి, నేపధ్యం మార్చేసి(హీరో పాత్రని మార్చడం, లొకేషన్ మార్చడం లాంటివి), కథనాన్ని తిరగేసి దానికో కొత్త ఎలిమెంట్(హర్రర్, థ్రిల్స్, యాక్షన్ లాంటివి) ని జత చేసి మళ్ళీ ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఇలా చేయడంలో కొంతమంది సక్సెస్ అవుతున్నారు. కొంతమందేమో చేతులు కాల్చుకొని వెళ్లి ఆకులు పట్టుకుంటున్నారు. ఇదే పని కరుణాకరన్ కూడా చేసాడు. చిన్నదాన నీకోసం అంటూ పాత కథని తీసుకొని దానికి కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసాడు. కానీ ఆ మిక్సింగ్ ని సరిగా చేయలేక దెబ్బైపోయాడు. ఇదేలాగే ఈ మధ్య మన డైరెక్టర్స్/రైటర్స్ స్వచ్చమైన కామెడీ రాసుకోలేక రాను రానూ వాళ్ళని వాళ్ళే దిగజార్చుకుంటూ గే కామెడీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఇదొక ట్రెండ్ గా మారింది. వీళ్ళు చూపిస్తున్న గే కామెడీ అనేది కామెడీ కాదు అదొక టార్చర్, అదొక రోత అని వీళ్ళకి ఎప్పటికి అర్థమవుతుందో..Nithiin,Mishti Chakraborty,A. Karunakaran,Nikita Reddy,Anoop Rubens.పంచ్ లైన్ : చిన్నదాన నీకోసం - చివరిదాకా నీరసం.!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: