విశ్వరూపం: రివ్యూ

Prasad

Vishwaroopam: Tweet Review || తెలుగు ట్వీట్ రివ్యూ || English Full Review

విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన కొత్త సినిమా విశ్వరూపం. ఈ సినిమాకు కమల్ హాసన్ దర్శక, నిర్మాతగా వ్యవహరించడం విశేషం. టెర్రిరిజం నేపథ్యంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించారు. పైగా ఈ సినిమా కొన్ని వివాదాల్లో చిక్కుకోవడంతో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది. కొన్ని ఆవాంతరాల నడుమ ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ ‘విశ్వరూపం’ ఎలా ఉందో చూద్దాం..! చిత్రకథ :     న్యూయార్క్ నగరంలో ఉండే విశ్వనాథన్ [కమల్ హసన్] నాట్యగురువు గా పని చేస్తుంటాడు. అతని భార్య నీలిమ [పూజాకుమార్] పిహెచ్ డి చేస్తుంటుంది. నీలిమ నియమించిన గుఢాచారి ద్వారా ఆమెకు ఒక నిజం తెలుస్తుంది. విశ్వనాథన్ హిందువు కాదని, అతను ఒక ముస్లిం అని నీలిమ తెలుసుకుంటుంది. విశ్వనాథన్ అసలు ఎవరు...?, ఎందుకు హిందువు గా చలామణి అవుతుంటాడు...? అనేది వెండి తెర పై చూడాలి. నటీనటుల ప్రతిభ :   కమల్ హసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఈ సినిమాలో అతను మూడు రకాల షేడ్స్ లో కనిపిస్తాడు. నాట్యగురువుగాను, ఆల్ ఖైదా గాను, ఆర్మీ ఆధికారిగాను ఈ చిత్రంలో కనిపించిన కమల్ ఈ మూడు రకాలుగానూ ప్రేక్షకులను మెప్పిస్తాడు. నాట్య గురువు పాత్రలో అంతసేపు నవ్వులు కురిపించి అంతలోనే యాక్షన్ సీన్ తో ఆకట్టుకోవడం కమల్ కు మాత్రమే సాధ్యం అనిపించింది. ఒమర్ గా రాహుల్ బోస్ నటన బావుంది. కమల్ హసన్ భార్యగా పూజా కుమార్ కరెక్ట్ గా సరిపోయింది. అయితే ఆమెకు చెప్పిన డబ్బింగ్ బాగోలేదు. మిగిలిన వారికి ఈ సినిమాలో అంతగా ప్రాధాన్యం లేదు. సాంకేతిక వర్గం పనితీరు : ఫోటోగ్రఫీ చాలా బావుంది, సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ లో జరిగే సన్నివేశాలను  చక్కగా తీసారు. ఆర్ట్ డైరెక్షన్ అదిరిపొయింది. చెన్నై లో వేసిన సెట్ లోనే అఫ్ఘనిస్తాన్ ను అద్భుతంగా ఆవిష్కరించారు. ఆఫ్ఘనిస్తాన్ ఇళ్ళు, అక్కడి వాతావరణాన్ని ఆర్ట్ డైరెక్షన్ సజీవంగా మన కళ్ళ ముందు ఉంచింది. అలాగే అక్కడ జరిగే యాక్షన్ దృశ్యాలను అద్భుతంగా తెరక్కెక్కించారు. ఈ సినిమాలో పాటలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. నేపధ్య సంగీతం బాగుంది. మాటలు డబ్బింగ్ సినిమాకు తగినట్లు గా ఉన్నాయి. నిర్మాణ విలువలు చాలా గ్రాండ్ గా ఉన్నాయి.  దర్శకత్వం విషయానికి వస్తే కథాబలం పెద్దగా లేని స్రీన్ ప్లేతో నడిచే సినిమా ఇది. ఆఫ్ఘనిస్తాన్ - అమెరికా మధ్య జరిగే కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. అయితే సినిమా నడిచే క్రమం ప్రేక్షకులను సినిమాలో లీనం కానివ్వదు. సందేశం చెప్పాలని దర్శకుడు ఈ సినిమా తీయాలనుకున్నాడో లేక తాను ఫీలయ్యింది ప్రేక్షకులు కూడా ఫీలయినట్లు చేయాలని ఈ సినిమాను రూపొందించాడో అర్థం కాదు. సినిమాను సాఫీగా నడపడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. మధ్యమధ్యన ఫ్లాష్ బ్యాక్ చెబుతూ కన్ ఫ్యూజ్ చేస్తాడు. కొన్ని దృశ్యాల్లో పాత్రలు వేరొక భాష మాట్లాడుతుంటే కిందన సబ్ టైటిల్స్ తెలుగులో రావడం ఏదో విదేశీ చిత్రం చూస్తున్న భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది. హైలెట్స్ :  
  • కమల్ నటన
  • ఫోటోగ్రఫీ
  • ఆర్ట్ డైరక్షన్
  • నిర్మాణ విలువలు
  •    డ్రాబ్యాక్స్ :  
  • కథ
  • స్ర్కీన్ ప్లే,
  •  ప్రేక్షకులను సినిమాలో లీనం చేసే అంశాలు లేకపోవడం [ఉదా : అఫ్ఘనిస్తాన్ నేపథ్యం, పాటలు, వినోదం తక్కువ కావడం]
  •     విశ్లేషణ :  ఈ సినిమాలో కమల్ హసన్ చెప్పిన ‘ ఐ ఆయామ్ గుడ్ విత్ బ్యాడ్’ అనే డైలాగ్ ఈ సినిమాకూ వర్తిస్తుంది. తీవ్రవాదం మీద సినిమా తీయడం అనే ఉద్దేశ్యం మంచిదే అయినా ఎలా తీస్తున్నాం...?, ఎందుకు తీస్తున్నాం...? అని కమల్ ఆలోచించుకుంటే ఇంకా మంచి సినిమా వచ్చి ఉండేది. ఆఫ్ఘనిస్తాన్ నేపధ్యాని ఎంచుకునే బదులుగా తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ నేపథ్యాన్ని ఎంచుకుని ఇక్కడ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమా తీయవచ్చని గతంలో చాలా మంది దర్శకులు నిరూపించారు. ఈ సినిమాలో స్ర్కీన్ ప్లే ఆకట్టుకునే విధంగా సాగపోగా, చాలా చోట్ల బోర్ కొట్టిస్తుంది. ఈ సినిమాలో ‘విశ్వరూపం’ కు సీక్వెల్ ఉన్నట్లుగా చూపించారు. అందులోనైనా కమల్ ఈ లోపాలను సవరించుకుంటే అప్పుడు మరింత మంచి సినిమా చూడవచ్చు.   చివరగా : డిటిహెచ్ లో చూసేంత విషయం ‘విశ్వరూపం’ లో లేదు. తొందర్లోనే కేబుల్ టివి లోనే ఈ సినిమా చూడొచ్చు.  

    Vishwaroopam: Cast & Crew







    More Articles on Vishwaroopam || Vishwaroopam Wallpapers || Vishwaroopam Videos


     " height='150' width='250' width="560" height="315" src="https://www.youtube.com/embed/8EfZ0ThRpyI"data-framedata-border="0" allowfullscreen STYLE="margin-left:30px">
     

    మరింత సమాచారం తెలుసుకోండి:

    సంబంధిత వార్తలు: