పవన్ ను టార్గెట్ చేస్తూ బండ్లగణేష్ సంచలన వ్యాఖ్యలు !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ వీరభక్తుల లిస్టులో బండ్ల గణేష్ కు అగ్రస్థానం ఇలాంటి పరిస్థితులలో బండ్ల గణేష్ పవన్ ను టార్గెట్ చేస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన కోరిక అని ఏదో ఒకరోజు తప్పక ఆ కోరిక తీరుతుందని అంటూ పవన్ అభిమానులకు జోష్ ను కలిగించాడు. 

అంతేకాదు పవన్ కళ్యాణ్ భగవంతుడు తయారుచేసిన అరుదైన వ్యక్తి అంటూ ఒక రేంజ్ లో పవన్ ను ఆకాశంలోకి ఎత్తేస్తూ బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి.  పవన్ కళ్యాణ్ కు ఉన్న ఆవేశం రాష్ట్ర ప్రజల మంచి కోసమేనని చెపుతూ ఒకవేళ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని ముఖ్యమంత్రికి కావలసిన అన్ని అర్హతలు పవన్ కళ్యాణ్ కు ఉన్నాయని అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు.  

పవన్ కు తనకు మధ్య కాస్త గ్యాప్ వచ్చిన మాటలు వాస్తవమే అని చెపుతూ తమ శరీరాలు వేరైనా తమ మనసులు ఒకటేనని కామెంట్ చేసాడు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి హడావిడి చేసిన బండ్ల గణేష్ తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఒక మీడియా సంస్థ ప్రతినిధితో గతంలో ట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఒకవేళ అది సాధ్యం కాకపోతే సెవన్ ఓ క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకుంటా అని చెప్పి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.  

ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న బండ్ల గణేష్ తిరిగి యూటర్న్ తీసుకుని నటుడుగా మారినా మళ్ళీ నిర్మాతగా మారి నానితో సినిమాను తీయాలని గట్టిప్రయత్నాలు చేస్తున్నాడు. పవన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ బండ్ల గణేష్ చేసిన ఈ కామెంట్స్ తో తిరిగి పవన్ ఈ బ్లాక్ బస్టర్ నిర్మాతను దగ్గరకు తీసుకుంటాడేమో చూడాలి..  
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: