మానవత్వం ఎక్కడ? ఉంది : రష్మిక

siri Madhukar
దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై కొంత మంది కామాంధులు అత్యాచారాలు, హత్యలకు, లైంగిక దాడులు చేస్తూనే ఉన్నారు.  చిన్న పెద్ద అనే వయసు తో నిమిత్తం లేకుండా ఎక్కడ పడితే అక్కడ అమానవీయంగా మహిళలపై దాడులు చేస్తున్నారు.  రాయచూరు నవోదయ ఇంజినీరింగ్ విద్యార్థిని మధుపత్తార్‌పై కొందరు అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంది. 

విద్యార్థిని మధుపత్తార్‌పై దారుణంగా అత్యారాచానికి పాల్పడి ఆపై హత్య చేశారని పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే.  అంతే కాదు ఆ సమయంలో మధుపత్తార్ ని  బలవంతంగా సూసైడ్ నోట్ కూడా రాయించారని వెల్లడించారు. ఈ దారుణ ఘటనపై కథానాయిక రష్మిక, సింగర్ చిన్మయి స్పందించారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మధుపత్తార్‌ పై అత్యాచార విషయం పలువురు మహిళా సంఘాలు ఆందోళన చేపట్టారు.

దేశంలో అసలు మానవత్వం అనేది ఉందా?రాయచూర్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని మధు అత్యాచారానికి గురైంది, ఆమెను దారణంగా హత్య చేశారు. నిజంగా ఈ సంఘటన నా హృదయాన్ని బద్దలు చేసింది. ఇలాంటివి ఇంకెన్ని జరుగుతాయి? మధుకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. దీనికి ఓ ముగింపు ఉండాలి’ అని రష్మిక ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది.
Where is the humanity? According to sources Madhu a Raichur ,engineering student was raped, murdered.. this truly breaks my heart..how many more like this beforeit stops? #JusticeForMadhu ..Hope justice is given.. and this comes to an end..😔

— Rashmika Mandanna (@iamRashmika) April 19, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: